అన్వేషించండి

Andhra Caste Census : ఆంధ్రాలో కులగణన వాయిదా - ఎందుకంటే ?

Andhra Caste Census : ఆంధ్రా కులగణన ప్రక్రియను వాయిదా వేశారు. డిసెంబర్ 10 నుంచి చేపడతామని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.


Andhra Caste Census : ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియను తాత్కలికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ్మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం  సన్నాహాక శిబిరాలను కూడా పూర్తి చేశారు. పూర్తి స్థాయి కులగణనకు ఏర్పాట్లు  చేశారు.  ఈ నెల 27 నుంచి వారం రోజుల్లో కులగణన చేయాలనుకున్నారు. కనీ ఇప్పుడు  డిసెంబర్ 10వ తేదీ నుండి  చేపట్టాలని నిర్ణయించారు. 

ఆడుదాం ఆంధ్రా, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు అవాంతరం 

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో పాటుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో, కులగణన కార్యక్రమాన్ని డిసెంబర్ 10వ తేదీ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాల్లో సవరణ చేసింది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి చేయాలని భావించింది. కానీ, ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమాల్లో అవాంతరాలు రాకుండా తాజా నిర్ణయం తీసుకుంది.

కులగణనకు  ప్రత్యేక యాప్ రెడీ చేసిన ప్రభుత్వం

కులగణన వాలంటీర్లతో నిర్వహింప చేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది.  ఇందుకోసం ప్రత్యేక యాప్ సిద్ధం చేశారు.  కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్ లో ప్రత్యేక యాప్ పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్ ఫోన్ ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తి అయిన తరువాత గానీ, స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా యాప్ ను డిజైన్ చేసారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహ వివరాలు, కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటుగా ఉపాధికి సంబంధించిన వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు డిసెంబర్ 10వ తేదీ నుంచ కులగణన ప్రారంభం  అవుతుంది.                          

బీసీ కులాలపై స్పష్టత వస్తుందన్న ప్రభుత్వం

కులగణన ద్వారా బీసీ కులాలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.    వృత్తులవారీగా సమగ్ర అధ్యయనం చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. దీంతో బీసీ సామాజిక వర్గాల వారీగా ఉన్న జనాభాపై స్పష్టత రానుంది. ఇలా వివరాలు తెలిస్తే.. పథకాలు సక్రమంగా అమలు చేయవచ్చని అంచనా వేస్తోంది. 

ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget