CM Jagan Comments: వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు, స్కాములు తప్ప స్కీములు తెలియవు - జగన్ ఘాటు వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని సీఎం జగన్ అధికారికంగా ప్రారంభించారు.
చిలకలూరి పేట సభలో ఎప్పటిలాగే సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తనను ఎదుర్కోలేక చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని జగన్ వాపోయారు. స్కాములు తప్ప స్కీములు తెలియవని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా, దోచుకో తినుకో పంచుకో అనేది మాత్రమే తెలిసిన లంచావతారాలకు, గజ దొంగలకు, వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ వాళ్లు అని అభివర్ణించారు. సామాజిక అన్యాయం తప్ప, న్యాయం తెలియని పరాన్నజీవులు అంటూ మాట్లాడారు. వీరంతా చంద్రబాబు, ఎల్లో మీడియా రూపంలో కనిపిస్తారని చెప్పారు. వీరికి తోడుగా దత్తపుత్రుడు కలిశాడని అన్నారు. వీళ్లందరూ మీ బిడ్డను ఎదుర్కోలేక కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులతో వీళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు.
‘‘ఏపీలో 100 శాతం ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు భర్తీ చేశాం. రాష్ట్రంలో స్టాఫ్ నర్సుల పోస్టులు వంద శాతం భర్తీ చేశాం. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యంపై రూ.18 వేల కోట్లు ఖర్చు పెట్టాం. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. శిథిలావస్థకు చేరిన మరో 11 మెడికల్ కాలేజీల రూపు రేఖలు మారుస్తున్నాం’’ అని జగన్ అన్నారు.