అన్వేషించండి

AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మత్స్యకార భరోసా పథకం కింద 20 వేల రూపాయలు అందజేస్తుంది. దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మత్స్యకార భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • మే 15 లేదా 16న లబ్ధిదారుల ఖాతాల్లో ₹20,000 జమ అవుతుంది.
  • కొత్త నిబంధనలు, రూల్స్ సవరించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది.
  • gswsnbm.ap.gov.in పోర్టల్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

AP Matsyakara Bharosa 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాలు గుడ్ న్యూస్. సముద్రంలో చేపల వేటపై ఏటా విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ఏడాది సాయాన్ని మరో పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సముద్ర మత్స్య సంపదను సంక్షించడం, చేపల పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా చూడటానికి ఈ 61 రోజుల నిషేధం విధిస్తారు. సాధారణంగా ఏప్రిల్‌ 15 నుంచి జూన్ 14 వరకు చేపలు, రొయ్యల, సంతాన ఉత్పత్తి కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో యాంత్రిక, మోటరైజ్డ్‌ బోట్లతో వేట సాగిస్తే మత్స్యసంపద లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తూర్పు తీరంలో ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే ఈ రెండు నెలల పాటు సముద్రంలోకి వెళ్లలేని మత్స్యకారులకు ఉపాధి కరవై, వారి కుటుంబాలు గడవడం భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఈ కష్టకాలంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 

15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు

గత ఏడాది 2025లో ఏప్రిల్ 26న నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మే 1 నుంచి మే ఆరు వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించిన అనంతర తుది జాబితాను కలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల అంచనా ప్రకారం మే 15 లేదా 16 తేదీల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 20 వేల రూపాయల జమ అయ్యే అవకాశం ఉంది. 

ఇవి పక్కాగా ఉంటేనే డబ్బులు

ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం కొన్ని కీలక నిబంధలను పెట్టింది. మత్స్యకారుల వయసు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసే వారు లేదా బోటు యజమానులు మాత్రమే అర్హులు. వేట నిషేద సమయంలో సముద్రంలోకి వెళ్లని వారికి మాత్రమే ఈ సాయం అందుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా, పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 

రూల్స్ సవరించిన కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనం కోసం కొన్ని పాత రూల్స్‌ను సవరించింది. గతంలో మోటారు పడవలకు కనీసం వెయ్యి లీటర్ల, మెకనైజ్డ్‌ పడవలకు వెయ్యి లీటర్ల డీజిల్ రాయితీని వినియోగించి ఉండాలనే నిబంధన ఉండేది. ప్రభుత్వం ఆ రూల్‌ను తొలగించింది. మత్స్యశాఖలో నమోదైన అన్ని అర్హత గల బోట్లకు భృతిని వర్తింపజేస్తోంది. ఎన్టీఆర్ పెన్షన్ పొందుతున్న వారు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ ఇరవై వేల సాయం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. 

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మత్స్యకారులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి gswsnbm.ap.gov.in పోర్టల్‌ను సందర్శించవచ్చు. మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ నమోదు చేసి, మొబైల్‌ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా మీ పేమెంట్‌ స్టేటస్‌ చూడవచ్చు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.  

Frequently Asked Questions

మత్స్యకార భరోసా పథకం ఎందుకు అమలు చేస్తున్నారు?

సముద్రంలో చేపల వేటపై విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయంలో మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు.

2026 సంవత్సరానికి మత్స్యకార భరోసా పథకం కింద ఎంత మొత్తం అందజేయనున్నారు?

తాజా సమాచారం ప్రకారం, మే 15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది.

మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధి పొందడానికి అర్హతలు ఏమిటి?

మత్స్యకారుల వయసు 18-60 ఏళ్ల మధ్య ఉండాలి, మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసేవారు లేదా యజమానులు, వేట నిషేధ సమయంలో సముద్రంలోకి వెళ్లనివారు అర్హులు.

దరఖాస్తు స్థితిని ఎలా తెలుసుకోవచ్చు?

lmbm.ap.gov.in పోర్టల్‌లో మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Caste Certificate Download: మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget