Amaravati Quantum Valley: ఐకానిక్‌గా అమరావతి క్వాంటం వ్యాలీ, గాలి చొరబడకుండా ఐసోలేషన్- డిజైన్లపై ప్రభుత్వం కసరత్తు
Andhra Pradesh Quantum Valley | ఐకానిక్‌గా అమరావతి క్వాంటం వ్యాలీ బిల్డింగ్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. క్వాంటం కంప్యూటర్ ఉండే రూంలోకి గాలి చొరబడకుండా ఐసోలేషన్ చేయనున్నారు.

Amaravati Quantum Valley | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటవ్యాలీలో ఐకానిక్ టవర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఐకానిక్ టవర్ చాలా ప్రత్యేకంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా క్వాంటం వ్యాలీ డిజైన్ గురించి మాట్లాడుకునేలా, ఇక్కడి నుంచే క్వాంటం సేవలు అందించేలా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇటీవల క్వాంటం వ్యాలీ గురించి కార్యక్రమం నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు అమరావతిలో ఐకానిక్ టవర్ పై అధికారులతో రెండుసార్లు చర్చించారు. సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ డిజైన్ ఫిక్స్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది.
IBM కంప్యూటర్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్
ఐబీఎం కంపెనీ 156 క్యూబిట్‌ల క్వాంటం టు కంప్యూటర్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి డిపిఆర్ అందించింది. పలు అంతర్జాతీయ టెక్ సంస్థలను అమరావతి క్వాంటం వ్యాలీకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాఫ్ట్వేర్, హార్డ్ వేర్ కంపెనీలతో పాటు యూనివర్సిటీలకు ఓకే ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీలో కంప్యూటర్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ను ఐబిఎం కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏకంగా 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మిస్తున్నారు.
క్వాంటం కంప్యూటర్ ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. క్వాంటం ఫిజిక్స్, క్వాంటం సెన్సింగ్ లాంటి పలు రకాల టెక్నాలజీతో క్వాంటం కంప్యూటర్ తయారు చేస్తారు. క్వాంటం కంప్యూటర్ ఉండే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ గదిలోకి కొంచెం గాలి వెళ్లినా, తరంగాలు తగిలినా క్వాంటం కంప్యూటర్ ప్రాసెసర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏబీఎం తయారు చేసే క్వాంటం కంప్యూటర్లో ఉపయోగించే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ డిజైన్ తయారీ యూనిట్లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు.
#QuantumValleyInAP
— N Chandrababu Naidu (@ncbn) June 30, 2025
In 1995, I championed the IT revolution in Andhra Pradesh to create jobs for empowering our youth and to attract investments for the state's growth. Today, in 2025, I am making the same commitment to Quantum Technology.
By January 1, 2026, Amaravati will host… pic.twitter.com/75mo35c7cC
క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే గదిని ఐసోలేట్ చేసుకుంటూ వస్తారు. బయట నుంచి ఎలాంటి గాలి, వెలుతురు తగలకుండా, శబ్దాలు రాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. మైనస్ 253 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్వాంటం కంప్యూటర్లో ఉపయోగించే ప్రతి చిన్న విడి భాగాన్ని శాస్త్రవేత్త మానిటర్ చేస్తారు. క్లౌడ్ ద్వారా ఇక్కడ నుంచే ప్రపంచం మొత్తానికి క్వాంటం సేవలను అందించేలా ప్లాన్ చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు
అమరావతి క్వాంటం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీ తర హాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బిల్డింగ్స్ నిర్మించి ఆయా టెక్ సంస్థలకు ఇస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన తరహాలో బిల్డింగ్స్ నిర్మించాలని భవనాల డిజైన్లపై క్లారిటీ ఇచ్చారు. ఒక ఉద్యోగికి సగటున 150 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలన్న అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణంలో దాదాపు 60 వేల మంది పనిచేసేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.






















