అన్వేషించండి

Nara Lokesh: జగన్ విమర్శలకు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది మీరే అంటూ ఫైర్

వైసీపీ పాలనలో నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోయారని, వారి జీవితాలతో ఆడుకున్నది కాకుండా.. దొంగే దొంగా దొంగ అన్నట్లుగా నాటకాలు ఎందుకు జగన్ అని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.

Nara Lokesh on ADCET | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నది మీరే. పాపాలు చేసిన మీరు నాకు శాపాలు పెట్టడం ఏంటి?  ఇప్పుడు దొంగే దొంగా దొంగ అన్నట్టు, ఎందుకీ నాటకాలు జగన్ అని ప్రశ్నించారు. 2020-21లో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాగా.. యూనివర్సిటీకి సొంత బిల్డింగ్, ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా 3 ఏళ్లు నడిపింది వైసీపీ ప్రభుత్వం అన్నారు. 

‘కనీసం ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా కన్సల్టెంట్లతో యూనివర్సిటీ నడిపించి, విద్యార్ధుల జీవితాలతో జగన్ ఆడుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకుండా మీరు చేసిన నిర్వాకం వల్ల మూడు బ్యాచుల విద్యార్థులు 2020- 21, 2021-22 & 2022-23 బ్యాచ్ లకి సంబంధించిన వారు నష్టపోయారు. దీని ప్రభావం ఈ ఏడాది ADCET పై పడింది. పర్మిషన్ కోసం వచ్చిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA), యూనివర్సిటీని 2024 జులై 1, 2  సందర్శించి, కనీస సౌకర్యాలు కూడా లేవంటూ యూనివర్సిటీలో లోపాలపై అదే ఏడాది జులై 26న నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 8వ తేదీన వైసీపీ ప్రభుత్వం దానిపై వివరణ ఇచ్చింది. 

క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదు అంటూ 2020- 21, 2021-22, 2022-23 బ్యాచ్ లకు అనుమతులు ఇచ్చేది లేదని అక్టోబర్ 10వ తేదీన COA తెలిపింది. నవంబర్ 20న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లని తాత్కాలిక పధ్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ జులై 2, 2025న అనుమతిని మంజూరు చేసి, ఇదే విషయాన్ని జులై 3, 2025న COA కి తెలిపిందని’ నారా లోకేష్ పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు
కనీస సిబ్బంది లేని కారణంగా APSCHEకి లేఖలు పంపి, ADCET 2025కి కన్వీనర్‌ను నియమించాలని కోరింది కూటమి ప్రభుత్వం. యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వైసీపీ హయాంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామక నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దాంతో విద్యార్ధులు నష్ట పోకుండా సిబ్బందిని నియమించటానికి కూటమి సర్కార్ చర్యలు తీసుకుంది. వైసీపీ హయాంలో కనీసం రెగ్యులర్ స్టాఫ్ లేకుండా కన్సల్టెంట్లతో నడిపారు. కనీసమైన సౌకర్యాలు, భవనాలు కూడాలేకుండా యూనివర్సిటీ నడిపింది మీరు. మీ పాపాలను సరి చేస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు అండగా నిలుస్తుంది - మంత్రి నారా లోకేష్

జగన్ చేసిన విమర్శలు ఇవే..
టీడీపీ ప్రభుత్వం JNAFAUని విభజించడంలో విఫలమైందని, వైసీపీ ప్రభుత్వం 2020–21లో కడపలో YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించిందని జగన్ పేర్కొన్నారు. ‘AICTE, UGC అనుమతులు వచ్చాయి. కానీ కరోనా సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) తనిఖీలు నిర్వహించలేదు. తరువాత మేం ఒప్పించడంతో, CoA అక్టోబర్ 2023లో కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి మూడు బ్యాచ్‌లకు ఆమోదం కోసం గత ఏడాది జూలై 1న తనిఖీ జరిగింది. 

వైస్-ఛాన్సలర్ నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆమోదం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ల మొదటి బ్యాచ్ కోసం, కనీసం ఇప్పుడైనా స్పందిస్తారని ఆశిస్తున్నాను. 2023–24, 2024–25 బ్యాచ్‌లకు CoA అనుమతులు మా హయాంలో పొందాం. కూటమి ప్రభుత్వం కొత్త విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి ఇప్పటివరకు ADCET పరీక్షను కూడా నిర్వహించలేదు. ADCET కోసం కన్వీనర్‌ను నియమించలేదు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి.. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి’ అని మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget