అన్వేషించండి

Andhra pradesh: ఏపీలో 28వేల కోట్ల మద్యం అమ్మకాలకు లెక్కల్లేవు, మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపణలు

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 28 వేల కోట్ల మద్యం అమ్మకాలకు లెక్కలు లేవని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యంతో దోపిడీ చేస్తూ జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు ఎలా వెళ్తారు అంటూ ప్రశ్నించారు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్సైట్ ఎందుకు మూసివేశారు? రాష్ట్రంలో వేయి కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా  ఈడీ, సీబీఐలకు ఇది కనిపించడం లేదా? అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.

" జగన్ ప్రతి ఇంటికి వెళ్లి నేనే మీ ఆరోగ్యాన్ని కాపాడతానని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఏమీ అభ్యంతరంలేదు.  వైద్యం అందక ఆశ వర్కర్ ఒక అమ్మాయి చనిపోయింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు జగనే సురక్ష అని ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం. వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీకి దిక్కులేదు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో, కిమ్స్ రెండు ఆసుప్రతుల్లోను ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడంలేదు. జగనన్న వచ్చాక వద్దు,  మేం తీసుకోము అంటున్నారు. విత్ డ్రా చేసుకున్నారు. జగన్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. అనేక ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషంట్లను వెనక్కి పంపిస్తున్నారు. నేడు ప్రజల ఆరోగ్యం పణంగా పెట్టి దాదాపు చీప్ లిక్కర్ 41 వేల కోట్ల దోపిడి చేశారు. సేల్స్ చూపించకుండా తగ్గించి చూపించి ప్రతి సంవత్సరం 7 వేల కోట్లు  దోపిడీ జరుగుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో కరెన్సీ నోట్లు ఇస్తే తప్ప మద్యం ఇవ్వరు. మద్యం షాపుల్లో రసీదు ఇవ్వరు" అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 

అక్రమ ఆర్జన కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా?

అక్రమ సంపాదన కోసం నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తావా అని ప్రశ్నించారు.  మద్యం నిషేదం  అంటూ  ప్రజలకు సొల్లు కబుర్లు చెప్పి నేడు నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే నేషనల్, ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లు రద్దు చేసి, తన బినామీలు, వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యం విక్రయించి వేల కోట్లు దండుకుంటున్నారని సోమిరెడ్డి చెప్పారు.  నాలుగున్నరేళ్లలో మద్యంపైనే రూ. 92 వేల కోట్లు సంపాదించారు. ఇది మందుబాబుల రక్తమాంసంతో తడిసిన డబ్బులే అని మాజీ మంత్రి సోమిరెడ్డి  చెప్పారు. 

ఈ నాసిరకం మద్యం త్రాగిన వారి నాడీ వ్యవస్ధ దెబ్బతిని తల తిరగడం, శరీరం మొత్తం మెలికలు తిరగడం, వాంతులు, మానసిక గందరగోళానికి గురయ్యే విషరసాయనాలు ఉన్నట్టు చెన్నైలోని SGS ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అమ్మే కల్తీ మద్యం మరియు నాటు సారా త్రాగి ప.గో జిల్లా జంగారెడ్డి గూడెంలో వారం (03 మార్చి 2022 నుంచి 09 మార్చి 2022) రోజుల వ్యవధిలోనే 26 మంది  చనిపోయారని తెలిపారు.  విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు ఇలా ప్రతి జిల్లాలో రోజు పదుల సంఖ్యలో మద్యం త్రాగి అనారోగ్యం పాలైన ఆస్పత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా  దీని వల్ల నాలుగున్నరేల్లలో వందలాంది మంది ప్రాణాలు కోల్పాయారని సోమిరెడ్డి చెప్పారు. 

ఒక్క విశాఖ కేజీహెచ్ లో ఏడాదిలో 36 మంది చనిపోయారని వెల్లడించారు. ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్ మధ్య 1,060 మంది చేరగా.. వారిలో 471 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే అని అన్నారు.  ఏడాది వ్యవధిలో వారిలో 36మంది చనిపోయారని అధికారులు చెబుతున్నా.. వారానికి ఇద్దరు చనిపోతున్నారని సిబ్బంది చెబుతున్నార చెప్పారు.  కేజీహెచ్ ఉదరకోశ వ్యాధుల విభాగం వార్డులో 37 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 25 మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆరోపించారు. మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నారని చెప్పారు. కాలేయం, క్లోమగ్రంధి (పాంక్రియాస్) దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గత నాలుగేళ్లుగా విపరీతంగా పెరుగుతోందని దేనిపై ప్రజలు ఆలోచించాలని చెప్పారు. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే....కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10-15 ఏళ్లు పడుతుందని.... కానీ ఏపీలో ఓ మాదిరిగా తాగే అలవాటున్నవారికీ నాలుగేళ్లలోనే కాలేయం పాడైపోతోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో  లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోతోందని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెప్పడం తమ దృస్టికి వచ్చిందని అన్నారు.  

బాధితులు ఎక్కువ రోజువారీ కూలీలే
బాధితుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పేదలే. వీరు రోజు కూలీలుగా పనిచేస్తూ తమకొచ్చే ఆదాయంలో  సగానికి పైగా మద్యంపైనే వెచ్చిస్తున్నారు.  దీంతో వారి ఒళ్లు గుల్లవుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, మంచానికి పరిమితమైపోయి అంతకుముందులా ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. 


టీడీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులు లేకుండా చూసింది
టీడీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులు లేకుండా చూసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం హయాంలో అనేకమందిపై ఎక్సైజ్ డిపార్టుమెంట్ కేసులు పెట్టి బెల్ట్ షాపులను నిరోధించిందని చెప్పారు. ఇప్పటి పరిస్థితులకు, అప్పటి పరిస్థితులకు ప్రజలు బేరీజు వేసుకోవాలని సోమిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 150 రూపాయల ఉన్న మద్యం బాటిల్ ను  250 రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు. మద్యం సారాయి దొరకని, బెల్ట్ షాపులు లేని పది గ్రామాలు చూపించగలరా అని నేను ఛాలెంజ్ చేస్తున్నానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget