Top Headlines: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్ - దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఇంకా చదవండి.
2. ఏపీలో ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీలో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ నవంబరు 27న ప్రకటించింది. దీనిప్రకారం ఎంపీసీ విభాగానికి చెందిన విద్యార్థులకు నవంబరు 29 నుంచి డిసెంబరు 6 వరకు, బైపీసీ విభాగానికి చెందిన విద్యార్థులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 14 మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు నవంబరు 29 నుంచి 30 వరకు, బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు నవంబరు 30 నుంచి డిసెంబరు 5 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా చదవండి.
3. తుపానుగా మారిన ఫెంగల్
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఫెంగల్... తుపానుగా మారింది. ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కి.మీ, నాగపట్టణానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 490 కి.మీ.ల దూరంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఉంది. నవంబర్ 30 నాటికి కారైకాల్, మహాబలిపురం మధ్య ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమపై కూడా ప్రభావం కనిపిస్తోంది. ఇంకా చదవండి.
4. దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. దిలావర్‌పూర్–గుండంపల్లి మధ్య నిర్మాణ దశలో పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు రోడ్డు ఎక్కారు. తమకు అన్నం పెట్టే పొలాలను వదుకునేందుకు సిద్దంగా లేమని ఫ్యాక్టరీ వల్ల పంట భూములు నాశనం అవుతాయని ఆందోళన బాటపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో వారంతా శాంతించారు. కానీ రాజకీయ కాక మాత్రం చల్లారడం లేదు. ఇంకా చదవండి.
5. హైడ్రా, మూసీ ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకులు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో రేవంత్ ప్రారంభించిన రెండు ముఖ్యమైన పనులు హైడ్రా ద్వారా చెరువుల పునరుజ్జీవం, మూసి ప్రక్షాళన. ఈ రెండింటిని ఎంత దూకుడుగా ప్రారంభించారో అంతే దూకుడుగా స్లో చేశారు. బహిరంగసభల్లో ఆపేదే లేదు అని చెబుతున్నారు కానీ.. ఆగినవి మళ్లీ ప్రారంభమయ్యే సూచనలే కనిపించడం లేదు. ఈ రెండు ఇష్యూలను సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న కారణంగా రేవంత్ పక్కన పెట్టేశారన్న అభిప్రాయం ఈ కారణంగా వినిపిస్తోంది. ఇంకా చదవండి.