Today Top Headlines: ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - గద్దర్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టు లాయర్ బి. బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది విచారణ చేపట్టారు. సీబీఐకి కేసుల బదలాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని, దీనిపై ఒక్క మాట ఏమైనా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది సూచించారు. ఇంకా చదవండి.
2. విజయసాయి రాజీనామా తర్వాత జగన్ వ్యూహమేంటి.?
వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 గా ప్రభావం చూపిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇంకో మూడేళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత జగన్ కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో చెప్పిన విధంగానే వ్యవసాయం మొదలుపెట్టారు. ఇప్పుడు వైసీపీకి మిగిలిన రాజ్యసభ సభ్యులు ఎందరు.. వారు ఎవరెవరు అన్నదానిపై సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలైంది. ఇంకా చదవండి.
3. మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) వైభవంగా జరుగుతోంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు తరలివెళుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకోసం APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకి వెళ్లాలి అనుకున్న భక్తులకోసం విజయవాడ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది APSRTC. ఈ బస్సులు కేవలం మహాకుంభమేళాకి మాత్రమే కాదు..ఈ యాత్రలో భాగంగా ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా మొత్తం 8 రోజుల టూర్ ప్లాన్ రూపొందించింది. ఇంకా చదవండి.
4. గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్ధన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమ నౌక గద్దర్ కేంద్రంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. పద్మ అవార్డుల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు వారి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. గద్దర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్టీటీఈ తీవ్రవాదితో పోల్చారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. దేశానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తికి ఎలా అవార్డు అడుగుతారని ప్రశ్నించారు. ఇంకా చదవండి.
5. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కివచ్చేనా.?
వివిధ దేశాలలో ఉండి కేసులో చిక్కుకున్న వారిని తిరిగి వారి సొంత దేశాలకు పంపించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఫోన్ టాపింగ్ కేసు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్‌కు రప్పించి సమాధానాలు రాబట్టాలని చూస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు ట్రంప్ నిర్ణయంతో పని తేలిక కానుంది. ఇంకా చదవండి.





















