PM Kisan 20th Installment: రైతులకు గుడ్ న్యూస్! జులై 18న విడుదల? మీకు డబ్బులు వస్తాయా లేదా చెక్ చేసుకోండి!
PM Kisan 20th Installment Date: దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ పథకం నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిధుల విడుదల తేదీ వచ్చే లోపు e-KYC చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

PM Kisan 20th Installment Date: దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అర్హత కలిగిన వ్యవసాయ కుటుంబానికి మూడు విడుతల వారిగా నిధులు వేస్తారు. ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు ఇస్తున్నారు.మొత్తంగా ఆరు వేల రూపాయలు ఇస్తారు. కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 19 విడతలుగా నగదు బదిలీ చేశారు.
గత విడత నిధులను 24 ఫిబ్రవరి 2025న బిహార్‌లోని భాగల్పూర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఇందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు. వీళ్లంతా 22,000 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందారు.
19వ విడత చెల్లింపు ఫిబ్రవరిలో జరిగినందున అక్కడి నాలుగు నెలలు జూన్ చివరి నాటికి నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ నిధులు ఎప్పుడు విడదల చేస్తారో క్లారిటీ లేదు. ఆ నిధుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
జులై 18 పీఎం కిసాన్ నిధులు
జులై 18న ప్రధాని మోదీ బిహార్‌లో సందర్శించనున్నారు. వచ్చే సంవత్సరం బిహార్‌లో ఎన్నికలు ఉన్నందున కీలకమైన పథకాలు ప్రధానమంత్రి మోదీ అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు కూడా 20 వ విడత పీఎం కిసాన్ నిధులు కూడా అక్కడి నుంచే విడుదల చేస్తారని అంటున్నారు. "జులై 18న ప్రధాని మోది బిహార్‌లోని మోతిహరిని సందర్శిస్తారు. ఇది ప్రధాని రాష్ట్రానికి 53వ పర్యటన అవుతుంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వికసిత్ బిహార్ కోసం" అని బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ కుమార్ జైస్వాల్ సోమవారం అన్నారు.
ప్రధానమంత్రి మోదీ తరచూ బహిరంగ సభల్లోనే పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ పథకానికి చెంది 20 వ విడత నిధులు కూడా అదే రోజు విడుదల చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
20వ విడత నిధులు విడుదల అయ్యే ముందు అర్హత కలిగిన రైతు కుటుంబాలు e-KYC, భూమి ధృవీకరణ వంటి ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. లేకుంటే నిధులు మీకు రాకపోవచ్చు.
సజావుగా నగదులు ప్రభుత్వం ఖాతా నుంచి మీ ఖాతాకు బదిలీ అవ్వడానికి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి.
e-KYCని ఎలా పూర్తి చేయాలి
e-KYCని మూడు పద్ధతుల ద్వారా పూర్తి చేయవచ్చు: PM కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథంటికేషన్ ద్వారా e-KYC చేయవచ్చు. CSCలు, రాష్ట్ర సేవా కేంద్రాలు (SSK)లో బయోమెట్రిక్ ఆధారిత e-KYC చేసుకోవచ్చు. PM కిసాన్ మొబైల్ యాప్‌లో OTP ఆధారంగా కూడా e-KYC చేయవచ్చు.
ఈ పథకంలో చేరేందుకు లబ్ధిదారులు కొంత సమాచారాన్ని తెలియజేయాలి. రైతు / జీవిత భాగస్వామి పేరు, రైతు / జీవిత భాగస్వామి పుట్టిన తేదీ, బ్యాంక్ ఖాతా నంబర్ IFSC/ MICR కోడ్, మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ యాప్‌లో అప్‌డేట్ చేయాలి.
- స్టెప్ 1: PM KISAN అధికారిక వెబ్‌సైట్, pmkisan.gov.in ఓపెన్ చేయండి
- స్టెప్ 2: ‘రైతు కార్నర్’ విభాగంపై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: ‘మొబైల్ నంబర్‌ను అప్‌డేట్’ ను ఎంచుకోండి
- స్టెప్ 4: ఆధార్ వివరాలు నమోదు చేయండి
- స్టెప్ 5: OTPతో ఆధార్ నెంబర్‌ను ధృవీకరించండి
లబ్ధిదారుని స్టాటస్ ఎలా చెక్ చేయాలి?
పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టాటస్ తనిఖీ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
- స్టెప్ 1: pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
- స్టెప్ 2: మీ రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయండి
- స్టెప్ 3: ‘లబ్ధిదారుల జాబితా’పై క్లిక్ చేయండి
- స్టెప్ 4: స్థానాన్ని ఎంచుకుని, ‘నివేదిక పొందండి’పై క్లిక్ చేయండి
- అనంతరం ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి.
పీఎం కిసాన్ అంటే ఏమిటి?
భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఫిబ్రవరి 2019లో మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. ఈ నగదు మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేస్తున్నారు. రైతుల రిజిస్ట్రేషన్లు ఇతర సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు.





















