అన్వేషించండి

Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు గుడ్ న్యూస్- పెట్టుబడి సాయంపై అప్‌డేట్ వచ్చేసింది

Chandra Babu: ఏటా రైతుకు 20000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ హామీ అమలు దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి అర్హులను గుర్తించే పనిలో పడింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే ఐదు కీలక హామీలను అమలు పరిచిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో హామీని ప్రజలకు అందించాలని ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే ఆ తీపి కబురు అందించనుంది. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద అందించే 20 వేల రూపాయల పథకంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. 

అర్హుల ఎంపికకు చర్యలు 

రైతులకు పెట్టుబడి సాయాన్ని కేంద్రం ఏటా 7500 రూపాయలు అందిస్తోంది. గత ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద దీనికి మరో ఆరు వేలు కలిసి 13500 రూపాయలు ఇచ్చేది. అయితే దీన్ని 20వేలకు పెంచుతామని కూటమి పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ హామీని అమలు పరిచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అర్హులు ఎంపికతోపాటు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. 

ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు 

ఐదేళ్లుగా రైతు భరోసార పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని వీలైన త్వరగా రైతులకు అందివ్వాలని చూస్తోంది. ఈ సాయాన్ని గత ప్రభుత్వం మూడు విడతల్లో అందించేది... కానీ ఈసారి మాత్రం రెండు విడతల్లో ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో రైతుల వివరాలు పొందుపరిస్తే అర్హుల గుర్తింపు సులభతరం అవుతుందని ప్రభుత్వ భావన. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. 

అర్హులందరికీ సాయం

వైసీపీ ప్రభుత్వ హయాంలో 49 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందేది. కుటుంబానికి ఒక వ్యక్తికే పెట్టుబడి సాయం అందించే వాళ్లు. రాష్ట్రవ్యాప్తంగా రూ.6534కోట్లు ఖర్చు పెట్టే వాళ్లు. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందివ్వాలని భావిస్తున్న వేళ ఈ ఖర్చు భారీగా పెరగనుంది. ఓ వైపు దానికి తగ్గట్టు నిధులు సమకూరుస్తూనే అర్హుల జాబితా తయారీ కోసం ప్రత్యేక విధానం తీసుకురానుంది. 

ఈ సర్టిఫికేట్స్‌ రెడీ చేసుకోండి

రైతులకు అందించే పెట్టుబడి సాయం విషయంలో వీలైనంత త్వరగా ఓ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతోపాటు రైతులకు సకాలంలో ఎరువు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సూటిగా చెప్పేశారట. 
రైతు పెట్టుబడి సాయం పోర్టుల్ అందుబాటులోకి వస్తే మాత్రం ముందుగా రైతుల వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం పాస్‌బుక్‌, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ల్యాండ్ పేపర్స్‌, మొబైల్ నెంబర్‌, ఇన్‌కం సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే పోర్టల్‌లో రైతుల వివరాలు అప్‌లోడ్ చేయనున్నారు. దీని కోసం సచివాలయ సిబ్బందిని ఊళ్లకు పంపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. జులై 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ లోపే విధివిధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం భవిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget