Telangana Maharashtra 12 Villages Issue | మరోసారి తెరపైకి వచ్చిన 12 గ్రామాల సమస్య | ABP Desam
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని 12 గ్రామాల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ముంబాయిలో జరిగిన ఒక సమావేశంలో 12 సరిహద్దు గ్రామాలు మావే అంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోను చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలను కొన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలోనే తమ గ్రామాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ను కలిసి వినతి పత్రం అందజేశారు.
మేము తెలంగాణలోనే ఉంటామని, మహారాష్ట్రతో తమకు సంబంధం లేదని అంటున్నారు. ఓటు, ఆధార్, రేషన్ కార్డుల ఆధారాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, తమను తెలంగాణలోనే కొనసాగించాలని కలెక్టర్ ను కోరారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని 12 గ్రామాల వివాదం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. 1987లో ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేర్చుకోవడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు పాలించడంతో పాటు రెండు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలు అమలు కావడంతో పాటు తమ .. ఓటు హక్కును వినియోగించే అరుదైన అవకాశం కూడా లభించింది.





















