Reactor Blast in Pashamylaram Industries | పాశమైలారం పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
పటాన్‌చెరులోని పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్ముకులను బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ సిబ్బంది.
పేలుడు దాటికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అదే బిల్డింగ్ లో భారీసంఖ్యలో కార్మికులు ఉన్నట్టు సమాచారం. పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. 20 మంది పైగా కార్మికులకు తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిధిలాల కింద నుండి ఆరుగురిని మాత్రమే రెస్క్యూ టీమ్స్ బయటకు తీశారు. భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. 11 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైడ్రా అధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. రియాక్టర్ పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డారు కార్మికులు. అదే సమయంలో కంపెనీ షెడ్డు కూడా కుప్పకూలింది. కెమికల్ ఫ్యాక్టరీలో నుండి మంటల వల్ల ఘాటైన వాసనలు వస్తుండడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సహాయక చర్యలో ఫైర్, రెవన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





















