MIM Master Plan Telangana Politics : మాస్టర్ ప్లాన్ - హంగ్ వస్తే హంగామా తప్పదా ?
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో రాబోతోంది. ఈసారి తెలంగాణ గడ్డపై గద్దెనెక్కేదెవరు అన్న ఆసక్తి రాజకీయాల్లో తారాస్థాయికి చేరుతోంది. మళ్లీ మేమే అని బీఆర్ఎస్, ఈసారి మా వంతు అని కాంగ్రెస్సు.... మేం లేమా అని బీజేపీ కలబడుతున్నాయి. ఇవన్నీ తెలంగాణ రణక్షేత్రంలో గట్టిగా తలబడుతుంటే.. ఒక పార్టీ మాత్రం చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. తాము కింగ్ అవలేం కానీ.. కింగ్ మేకర్ కావొచ్చని అనుకుంటోంది. తెలంగాణ హంగ్ వస్తే.. తమకు మంచి డిమాండ్ ఉంటుందని ఆ పార్టీ అనుకుంటోంది. ఎందుకంటే ఎందుకంటే ఏది ఏం జరిగినా ఆ పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి. అదే మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్.. MIM. తెలంగాణలో హంగ్ రావాలని.. వస్తే ఇక తమదే హంగామా అని ఆ పార్టీ అంచనాలు కడుతోంది.



















