CM Revanth Reddy on KCR | కేసీఆర్, హరీశ్ పాపాలతోనే తెలంగాణకు నష్టపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి | ABP Desam
బనకచర్లపై నిర్వహించిన తెలంగాణ ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు స్వల్ప వాగ్వాదం జరిగింది. బనకచర్లపై ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ గోదావరి బేసిన్ లో నీటిని ఎత్తి పోసుకునేందుకు అనుమతి తెలిపారని చెప్పడాన్ని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం చెప్పటంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వాకౌట్ చేశారు.
ప్రధాని మోదీతో తనకున్న పరిచయాలు వాడుకుని బనకచర్లకు చంద్రబాబు అన్ని అనమతులు సాధించగలరు అనుకుంటే అది ఆయన భ్రమేననన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాక్షేత్రంలో తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో తమకు తెలుసంటూ చంద్రబాబు పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి
దోచుకున్న వేలకోట్ల దాచుకోలేక బావ బావమరుదులు టెన్షన్ లు పడి లో బీపీలు తెచ్చుకుని హాస్పిటల్ లో కూడా చేరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రశ్నలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వచ్చి రోజూ, నేను ఉత్తమ్ కూర్చుంటాం అనుమతులు మీరే ఇవ్వండి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్, హరీశ్ రావు చేసిన పాపాలతోనే గోదావరి నీళ్ల కేటాయింపులో రేపు తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే కేసీఆర్, హరీశ్ రావులను ఉరితీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి





















