(Source: ECI/ABP News/ABP Majha)
Bheem Devudi Pelli | ఇప్పచెట్టు కింద పందిరి...ఉరుములు, మెరుపులు మధ్య భీం దేవుడి పెళ్లి | ABP Desam
ఆదివాసీలకు ప్రకృతికి మధ్య ఉన్న బంధం విడదీయరానిది. ప్రకృతి ఒడిలో నివసిస్తూ.. ప్రకృతిని పూజించే ఆదివాసీలు.. వేసవిలో కళకళలాడే ఇప్ప చెట్లను ఆరాధిస్తూ.. తమ దేవుళ్లకు మొక్కులు సమర్పిస్తున్నారు. వేసవిలో వైశాఖ మాస అమావాస్య రోజున ఇప్ప చెట్టు కింద భీందేవుడికి పెళ్ళి చేయడం వీరికి ఆనవాయితీ. ఇలా చేస్తే అందరికీ మంచి జరుగుతుందని, సకాలంలో వానలు కురిసి, పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. ఇప్పచెట్టు ఆదివాసీలకు ఆరాధ్య దైవం. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ఇప్పచెట్టుకు పూసిన పువ్వు నేల రాలుతుంది. ఆ పూలను ఆదివాసీలు ఏరుకొని.. వేసవిలో సరిగ్గా పంటలు పండకపోతే వీటితోనే వివిధ రకాల వంటకాలు వండుకుని తింటారు. తమ జీవితంలో భాగమై, తమ ఆకలి తీరుస్తుంది కాబట్టి ఆ ఇప్పచెట్టు కింద మే నెలలో వచ్చే అమావాస్య నాడు భీందేవుడికి పెళ్లి చెస్తారు. ఈ పెళ్లిని "చంచి భీమన మర్మి" అని ఆదీవాసీలు పిలుస్తారు.