Saina Nehwal Divorce With Kashyap | వివాహబంధానికి ముగింపు పలికిన సైనా నెహ్వాల్, కశ్యప్ | ABP Desam
బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపలి కశ్యప్ తమ వివాహబంధానికి ముగింపు పలుకుతున్నారు. పారుపల్లి కశ్యప్, తను విడిపోతున్నట్లు సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జీవితం కొన్ని సార్లు మనల్ని విభిన్నంగా నడిపిస్తుంది. బాగా మాట్లాడుకున్న తర్వాత నేనూ, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ప్రశాంతతను కోరుకున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి ప్రైవసీకి రెస్పెక్ట్ ఇస్తున్నారని భావిస్తున్నాం అని సైనా పోస్ట్ పెట్టారు. అయితే ఈ విషయంపై పారుపల్లి కశ్యప్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. 2018లో పెళ్లి చేసుకున్న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ గోపీ చంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ ఆడుతున్న టైమ్ నుంచి స్నేహితులు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ మాజీ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ కాగా 2012 లండన్ ఒలిపింక్స్ లో కాంస్యం గెలుచుకుని అప్పటికి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. అదే ఒలింపిక్స్ కశ్యప్ కూడా క్వార్టర్స్ కు చేరుకుని అక్కడి వరకూ వెళ్లిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కెరీర్ లో వరల్డ్ నెంబర్ 6వరకూ వెళ్లిన కశ్యప్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించి గోపీంచద్ అకాడమీలోనే కోచ్ గా పనిచేస్తున్నాడు. సైనా నెహ్వాల్ గాయం కారణంగా 2023 నుంచి బ్యాడ్మింటన్ ఆడటం లేదు.





















