Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే
ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయం వెనుక కెప్టెన్ రియాన్ పరాగ్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం, దానికి ధ్రువ్ జురెల్ ఇచ్చిన సలహా ప్రధాన కారణమని స్వయంగా పరాగ్ వెల్లడించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. చేజింగ్ లో గుజరాత్ తరపున సాయి సుదర్శన్ రాణించడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.
చివరి 2 ఓవర్లలో గుజరాత్ విజయానికి కేవలం 15 పరుగులు మాత్రమే కావాలి. ఆ సమయంలో బౌలింగ్ ఆర్డర్‌ను మార్చాలని పరాగ్ భావించాడు. కానీ, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ జోక్యం చేసుకుని, 19వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్‌తో వేయించాలని పరాగ్‌కు సలహా ఇచ్చాడట. ఆ సలహానే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆర్చర్ ఆ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే మరో 4 పరుగులే ఇవ్వడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది.
మ్యాచ్ అనంతరం పరాగ్ మాట్లాడుతూ.. "చివర్లో ఉత్కంఠతో నా గుండె ఆగినంత పనైంది. నిజానికి నేను బౌలింగ్ ఆర్డర్ మార్చాలనుకున్నాను, కానీ ఆ క్రెడిట్ అంతా జురెల్‌కే దక్కుతుంది. అతను చెప్పినట్లే ఆర్చర్‌తో 19వ ఓవర్ వేయించాం. మా ప్లాన్ పక్కాగా అమలైంది" అని చెప్పుకొచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు






















