RR vs MI Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 100 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ | ABP Desam
ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై అనూహ్యంగా ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ముంబై 200 ప్లస్ టార్గెట్ పెడితే అసలేం మాత్రం పోటీ ఇవ్వకుండా 117పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్...ముంబైకి 100 పరుగుల తేడాతో అప్పగించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. హిట్ మ్యాన్ మాస్ షో
టాస్ గెలిచిన రాజస్థాన్ మరీ ఎక్కువగా ఆలోచించేసి ముంబై ఇండియన్స్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించి చాలా పెద్ద తప్పే చేసింది. ప్రత్యేకించి ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టెన్ తో కలిసి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రఫ్పాడించాడు. పవర్ ప్లే నుంచే దుమ్ము దులిపిన రోహిత్ కేవలం 36 బాల్స్ లో 9ఫోర్లతో 53పరుగులు చేశాడు. ఈ సీజన్ లో రోహిత్ కి మూడో హాఫ్ సెంచరీ.
2. రఫ్పాడించిన ర్యాన్ రికెల్టెన్
ఓ వైపు రోహిత్ దుమ్ము దులిపితే ర్యాన్ రికెల్టన్ రచ్చ రచ్చ చేశాడు. 38 బాల్స్ లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన రికెల్టన్..రోహిత్ తో కలిసి ఫస్ట్ వికెట్ కే 116 పరుగుల పార్టనర్ షిప్ పెట్టాడు. తీక్షణ బౌల్డ్ చేయటంతో అవుటైన రికెల్టన్ ముంబైకి మాత్రం భారీ స్కోరు చేసేందుకు కావాల్సిన ఊపును అందించాడు.
3. SKY, పాండ్యా మెరుపులు
అప్పటికే రోహిత్, రికెల్టెన్ దుమ్ము దులిపి వదిలినా అది చాలదన్నట్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించారు.సూర్య కుమార్ యాదవ్ 23 బాల్స్ లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 48పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే...అదే 23 బాల్స్ లో 6ఫోర్లు ఓ సిక్సర్ తో సరిగ్గా 48పరుగులే చేసిన పాండ్యా ముంబై స్కోరు 200 దాటించి...రాజస్థాన్ రాయల్స్ కి 218పరుగుల టార్గెట్ సెట్ చేసేలా చేశారు వీరిద్దరూ.
4. నిప్పులు చెరిగిన ముంబై బౌలర్లు
218 పరుగుల లక్ష్యమైనా రాజస్థాన్ ఎక్కడైనా అద్భుతం చేస్తుందేమోననే సందేహం ఉంది. రీజన్ 14ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ..మంచి ఫామ్ లో ఉన్న యశస్వి జైశ్వాల్. కానీ ముంబై బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. ముందు దీపక్ చాహర్ వైభవ్ ను డకౌట్ చేసి వికెట్ల వేట ప్రారంభిస్తే..బౌల్ట్ పదునైన బంతులతో దుమ్ము రేపాడు. జైశ్వాల్ ను క్లీన్ బౌల్డ్ చేసిన బౌల్ట్..నితీశ్ రానా..జోఫ్రా ఆర్చర్ ల వికెట్లు తీసుకుని ఈ మ్యాచ్ లో 3 వికెట్లు సాధించాడు. మరో వైపు బుమ్రా జోరు చూపించాడు. 4ఓవర్లలో కేవలం 15పరుగులు మాత్రమే ఇచ్చిన బూమ్ బూమ్ 2వికెట్లు తీశాడు. అది కూడా పరాగ్ అండ్ హెట్మెయర్. చివర్లో కర్ణ్ శర్మ జురెల్ సహా తీక్షణ, కుమార్ కార్తీకేయ వికెట్లు తీసి తనూ ఓ మూడు వికెట్లు ఖాతాలో వేసుకోవటంతో రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేదు.
5. ఆర్చర్ పోరాటం
వాస్తవానికి 70-80 పరుగుల మధ్యే ముంబై ఆలౌట్ అయిపోవాల్సింది కానీ ముంబై గెలుపును ఆలస్యం చేశాడు జో ఫ్రా ఆర్చర్. 27 బాల్స్ లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ఆర్చర్...రాజస్థాన్ స్కోరు ను 117పరుగుల వరకూ లాక్కొచ్చి కాస్త పరువు కాపాడి అప్పుడు పదోవికెట్ గా వెనుదిరిగాడు.
మొత్తం ముంబై బౌలర్ల జోరుతో ఏకంగా 100 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచిన ముంబై అనూహ్యంగా నెట్ రన్ రేట్ ను భారీగా పెంచుకుని పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా నిలిచింది.





















