Romario Shepherd 53 Runs vs CSK | IPL 2025 లోనే ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన షెపర్డ్ | ABP Desam
ఇదేం మాస్ కొట్టుడు రా అయ్యా. నిన్న ఆర్సీబీ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ఆడిన ఇన్నింగ్స్ చూసిన వాళ్లు ఎవరైనా అనే మాట ఇదే. నిన్న మ్యాచ్ లో కొహ్లీ అవుట్ అయ్యేప్పటకి ఆర్సీబీ స్కోరు 12 ఓవర్లలో 121. ఓవర్ కి పది రన్ రేట్ ఉంది కానీ అక్కడి నుంచి ఆర్సీబీ స్కోరు మందగించింది. పతిరానా అద్భుతంగా బౌలింగ్ చేయటంతో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఆల్మోస్ట్ ఫెయిలైంది. ఓ దశలో అంటే ఇన్నింగ్స్ 17ఓవర్ ముగిసే టైమ్ కి ఆర్సీబీ 157పరుగులే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. మహా అయితే ఆ మూడుఓవర్లలో ముఫ్పై కొట్టినా..190వరకూ వెళ్లొచ్చు అనుకున్నారు కానీ ఆ దశలో రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే హిట్టింగ్ చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో పెను విధ్వంసం చేశాడు. ముందు 19ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ ను టార్గెట్ చేసి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సిక్స్, సిక్స్, ఫోర్, సిక్స్, సిక్స్, ఫోర్ అంటూ ఓవరంతా విధ్వంసం చేసి 33 పరుగులు రాబట్టాడు షెపర్డ్. ఈ సీజన్ లో ఓ బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగులు ఇవి. ఆ తర్వాత ఆఖరి ఓవర్ వేసిన పతిరానా నుంచి రెండు సిక్సులు రెండు ఫోర్లతో 20పరుగులు రాబట్టి కేవలం 14 బంతుల్లోనే 4ఫోర్లు 6 సిక్సర్లతో 53పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. అంతే కాదు చెన్నైపై ఓ ఆటగాడు కొట్టిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఇదే. ఈ విధ్వంసర ఇన్నింగ్స్ తో ఆర్సీబీని ఊహించని రీతిలో 200 పరుగులు దాటించిన షెపర్డ్..చెన్నైకి 214పరుగుల టార్గెట్ పెట్టాడు. చివరకు షెపర్డ్ కొట్టిన ఆ ఎక్స్ ట్రా పరుగులే ఆర్సీబీకి మ్యాచ్ లో విజయాన్ని కట్టబెట్టాయి. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం రొమారియో షెపర్డ్ కే దక్కింది.





















