![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KKR vs SRH Final IPL 2024 | చెన్నైలో ఫైనల్ కి ముందు అయ్యర్, కమిన్స్ ఫోటో షూట్ | ABP Desam
ప్రతీ పెద్ద క్రికెట్ ఈవెంట్ ఫైనల్ కి ముందు ఇలా కెప్టెన్లను ట్రోఫీలతో ఫోటో షూట్స్ చేయటం కామన్ కావచ్చు గడచిన ఏడాది కాలంలో పెద్ద ఈవెంట్ లో ఫోటో షూట్ చేసిన ప్రతీసారి ప్యాట్ కమిన్సే గెలిచాడు ఆస్ట్రేలియానే గెలిపించాడు. మరి ఈ సారి ఈ జెంటిల్మన్ తన లక్కీ ఛార్మ్ ను సన్ రైజర్స్ కు దక్కేలా చేస్తాడా. ఏడాదిలో రెండు భారీ టోర్నీలను గెలిపించిన కెప్టెన్ తెలుగు టీమ్ కు మూడో కప్పు అందిస్తాడా. ఇప్పుడు అందరి దృష్టి ఇదే. ఈ రోజు సాయంత్రం కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై చెపాక్ లో జరిగే ఫైనల్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కసితో ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే రెండు సార్లు కోల్ కతా మీద ఓడిపోయిన పరాభావానికి బదులు ఫైనల్లో తీర్చేసుకోవాలని భావిస్తున్నారు. ఫైనల్ కి ముందు సరదాగా శ్రేయస్ తో కలిసి ప్యాట్ కమిన్స్ ఎంజాయ్ చేశాడు. ఫోటో షూట్ కోసం మెరీన్ బీచ్ లో సందడి చేశాడు. ఆటోలో ఫోటో షూట్ తో కామన్ మేన్ ని రిప్రజెంట్ చేశాడు. మెరీనా తీరంలో పడవలపై కూర్చుని ఐపీఎల్ ట్రోఫీని ఇరు జట్ల కెప్టెన్లు ప్రదర్శించారు. కానీ మనం ముందు చెప్పుకున్నట్లు రెండు సార్లు ఫోటో షూట్స్ లోనూ కనపడి..రెండు సార్లు కప్పు కొట్టుకెళ్లిన కమిన్సే ఈ సారి కూడా గెలిచి సన్ రైజర్స్ కి ఐపీఎల్ ట్రోఫీ అందించాలని ప్రతీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యానూ కోరుకుంటున్నాడు.
![Rishabh Pant Runs and Catches vs Pak | Ind vs Pak మ్యాచ్ లో కీలకంగా రాణించిన పంత్ | T20 World Cup24](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/81b8ff3d894f3277038aa274b06b15911717992022436310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Shah Rukh Khan Chants CSK | కేకేఆర్ కప్పు గెలిచాక ధోనీ, మెస్సీకి షారూఖ్, అయ్యర్ ట్రిబ్యూట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/b32a62b62eda69d4dedba0b0230880271716869936718310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Shah Rukh Khan Flying kisses Along with KKR Team | హర్షిత్ రానాకు షారూఖ్ ఖాన్ మద్దతు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/858fd10b5b37dc70b9afc50832b453f61716869763338310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Kavya Maran with SRH Team After Loss | IPL 2024 KKR vs SRH Final ఓడిపోయాక కావ్యా మారన్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/6f9a385ff21526ecdc2a3c20db7fc68f1716869675709310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Shah Rukh Khan KKR IPL 2024 Win | పదేళ్ల తర్వాత కేకేఆర్ తో కప్ కొట్టిన షారూఖ్ ఖాన్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/27/5055b537c932df7026dbc5316c77cd581716786736686310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)