India vs Sri Lanka Asia Cup 2025 | Pathum Nissanka | నిశాంక సూపర్ సెంచరీ
సూపర్ 4 లో భాగంగా ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 202 భారీ స్కోర్ ను శ్రీలంక బ్యాటర్లు సమం చేసారు. మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ జరిగింది. కానీ సూపర్ ఓవర్ లో మాత్రం శ్రీలంక విజయం సాధించలేక పోయింది.
ఇండియా చేసిన భారీ స్కోర్ ను శ్రీలంక ఛేజింగ్ చేసే క్రమంలో బ్యాట్స్మన్ నిశాంక భారత బౌలర్లను బాగానే ఇబ్బంది పెట్టాడు. అద్భుతమైన బౌండరీలతో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. 25 బంతుల్లో నిసాంక అర్ద సెంచరీ సాధించాడు. దాసున్ షనక తో కలిసి నిసాంక టీమ్ గెలిపించేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో 52 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇది తన తొలి సెంచరీ కావడం విశేషం. ఆఖరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరమైన దశలో నిసాంక వెనుదిరిగాడు. మ్యాచ్ టైగా ముగిసింది. కానీ నిసాంక బ్యాటింగ్ కి అందరు ఫిదా అయిపొయ్యారు. భారీ స్కోర్ ను ఛేదించడానికి ఒకదశలో నిసాంక బ్యాటింగ్ కీలకంగా మారింది. అంత ఒత్తిడిలో కూడా తన బ్యాట్ తో మంచి ప్రదర్శన కనబర్చిన నిసాంకను ఫ్యాన్స్ అందరు పొగడ్తలతో ముంచేతుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు

















