Yashasvi Jaiswal Century vs Eng First Test | హెడింగ్లే టెస్టులో యశస్వి జైశ్వాల్ శతకం | ABP Desam
ఎన్నో అనుమానాలు, సందేహాలు మధ్య యువరక్తంతో నిండిపోయిన భారత టెస్టు జట్టు ఇంగ్లండ్ తో మొదటి టెస్టును ఘనంగా మొదలుపెట్టింది. హెడింగ్లే లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్విజైశ్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ రాహుల్ 42 పరుగులు చేసి అవుట్ కాగా...యశస్వి జైశ్వాల్ మాత్రం సెంచరీతో రెచ్చిపోయాడు. రాహుల్ తో కలిసి మొదటి వికెట్ కు 91 పరుగులు పార్టనర్ షిప్ పెట్టిన జైశ్వాల్..తర్వాత కెప్టెన్ గిల్ తో కలిసి టీమ్ ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో 150 బంతుల్లో 16 ఫోర్లు ఓ సిక్సర్ తో సెంచరీ బాదాడు యశస్వి జైశ్వాల్. టెస్టుల్లో జైశ్వాల్ కి ఇది ఆరో సెంచరీ కాగా...ఇంగ్లండ్ లో ఆడుతున్న మొదటి టెస్టులో నే సెంచరీ కొట్టి సచిన్ తర్వాత అతి చిన్న వయస్సులో సెంచరీ కొట్టిన టీమిండియా క్రికెటర్ గా రికార్డుల్లోకెక్కాడు యశస్వి జైశ్వాల్. జైశ్వాల్, గిల్ దూకుడైన ఆటతో టీమిండియా లో మొదటి ఇన్నింగ్స్ లో స్ట్రాంగ్ గా మారుతోంది.





















