Virat Kohli Ranji Trophy Match | అదే అవుట్ సైడ్ ఆఫ్ స్టంపు..ఈ సారి ఏకంగా క్లీన్ బౌల్డ్ | ABP Desam
పాపం విరాట్ కొహ్లీ..రాజు ఎక్కడున్నా రాజేరా అనే స్టేజ్ నుంచి ఈరోజు బ్యాడ్ లక్ ఎక్కడికెళ్లినా వెంటాడుతూ వేటాడబడే రేంజ్ కి పడిపోయాడు. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో తన పూర్ ఫామ్ నుంచి బయటపడేలా..ప్రధానంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కి అవుట్ కాకుండా తన స్కిల్ సెట్ ను మళ్లీ రూట్స్ నుంచి స్ట్రెంత్ చేసుకోవాలని ఉద్దేశంతో 12 సంవత్సరాల మళ్లీ రంజీ మ్యాచ్ ఆడాడు కొహ్లీ. రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన కింగ్..నిన్నంతా ఫీల్డింగ్ కే పరిమితమైనా ఈ రోజు బ్యాటింగ్ కి దిగాడు. యశ్ ధుల్ తర్వాత సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కి దిగిన విరాట్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ఫ్యాన్స్ ను అలరించాడు. ఆఫ్ సైడ్ ఫోర్ కొట్టి తన కోచ్ తో ఫ్యాన్స్ తో చప్పట్లు కొట్టించుకున్న విరాట్ ఆ నెక్ట్స్ బాల్ కే హరీశ్ సంగ్వాన్ అనే అనామక బౌలర్ వేసిన ఆఫ్ సౌడ్ ఆఫ్ స్టంప్ బాల్ కి ఏకంగా వికెట్లు సమర్పించేసుకుని తన పూర్ ఫామ్ ను కొనసాగించాడు. వికెట్ల అవతల వెళ్తుందని కొహ్లీ భావించుకున్న కంప్లీట్ ఇన్ స్వింగ్ అయ్యి వికెట్లను గిరాటేయటంతో ఏం చేయలేని పరిస్థితిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌలర్ సంగ్వాన్ ఆనందం చూడాలి. వాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లో చెప్పాడటం. కొహ్లీ అవుట్ చేసే ఛాన్స్ ని అస్సలు వదలను అని. అన్నట్లుగానే వికెట్ తీసుకుని తన కెరీర్ లో మర్చిపోలేని అనుభూతిని సాధించాడు సంగ్వాన్. కానీ పాపం కొహ్లీనే అభిమానులనే కాదు తనను తానే నిరాశపరుచుకుని డగౌట్ కి వెనుదిరిగాడు.





















