(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli 82 | పాకిస్థాన్ మ్యాచంటే పదేళ్లు గుర్తొచ్చే మ్యాచ్ | Ind vs Pak T20 World Cup 2024 | ABP
2022 టీ 20 వరల్డ్ కప్. పైగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్.వరల్డ్ కప్ ఎవడు కొడతాడు కాదు ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేదే ఇండియా, పాకిస్థాన్ ఫ్యాన్స్ కి ఇంపార్టెంట్. అలాంటి మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159పరుగులు చేసి మనకు 160పరుగులు టార్గెట్ ఇచ్చింది. కానీ లక్ష్య చేధన అంత ఈజీగా సాగలేదు. ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఉండాల్సిన టెన్షన్ పెంచేసేలా భారత్ 31పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లు అవుటైపోయినా...ఒక్కడు మాత్రం విజయాన్ని పాకిస్థాన్ కు ఇవ్వాలనుకోలేదు. ఆ రోజు మెల్ బోర్న్ మైదానం ఓ విధ్వంసకారుడి బ్యాటింగ్ ను కళ్లప్పగించి చూసింది. రోహిత్ శర్మ త్రివర్ణ పతాకంతో ఒంటిని వణికిస్తున్న ఓటమి చలిని కాచుకుంటున్న వేళ...శాంత స్వరూపం తప్ప కోపం తెలియని కోచ్ రాహుల్ ద్రవిడ్ గర్వంతో ఉప్పొంగిపోతున్న వేళ...విరాట్ కొహ్లీ ప్రళయకాల రుద్రుడిలా పాకిస్థాన్ మీద విరుచుకుపడ్డాడు. ప్రత్యేకించి కొహ్లీ కొట్టిన ఆ రెండు సిక్సర్లు ఈ శతాబ్దంలోనే అతి గొప్ప షాట్స్ గా చరిత్రలో నిలిచిపోతాయి. కొహ్లీ చేసిన 82 పరుగులు ఆ రోజు పాకిస్థాన్ కు చావు దెబ్బ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తూ మ్యాచ్ ను గెలిపిస్తే..టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. మళ్లీ రెండేళ్ల తర్వాత అలాంటి రోజు ఈ రోజు వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఈ రోజు భారత్ పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఐర్లాండ్ మీద మ్యాచులో కొహ్లీ తక్కువ స్కోరుకే అవుట్ అవటంతో...కసితో మీదున్న కింగ్ నుంచి పాకిస్థాన్ మీద అదిరిపోయే ఇన్నింగ్స్ ను ఆశిస్తున్నారు. మరో వైపు పాకిస్థాన్ కూడా USA చేతిలో ఎదురైన పరాభవంతో ప్రతీకారం కోసం ఎదురు చూడటం ఖాయం కాబట్టి ఈరోజు మ్యాచ్ మాములుగా అయితే ఉండదు.