Rohit Sharma Test Cricket Retirement | టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ | ABP Desam
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టిన రోహిత్ శర్మ..తెలుపు రంగుల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించటం ఎప్పటికీ గొప్ప అనుభూతి అని చెప్పాడు. ఇప్పటి వరకూ 67 టెస్టు మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 4వేల 301పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఇన్నాళ్ల పాటు తనను ఆదరించి అభిమానించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు రోహిత్ శర్మ. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్..ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్ టూర్ కోసం టెస్ట్ క్రికెట్ టీమ్ సెలక్షన్ విషయంలో కోచ్ గంభీర్ కు, రోహిత్ శర్మకు మధ్య మనస్పర్థలు చేశాడని బయటకు వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఏబీపీ సమ్మిట్ లో కోచ్ గౌతం గంభీర్ ఆ వార్తలను ఖండించాడు. తనకు రోహిత్ కు మధ్య ఎలాంటి విబేధాలు లేవని..ఫిట్ గా ఉండి మంచిగా ప్రదర్శన చేస్తుంటే కొహ్లీ రోహిత్ ఇద్దరూ 2027 వరల్డ్ కప్ ఆడతారని కూడా చెప్పాడు. అలాంటిది ఇఫ్పుడు ఉన్నపళంగా కెప్టెన్ గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించటంతో గంభీర్ వివాదం నిజమేనా అన్న విషయానికి కాస్త బలం చేకూరినట్లైంది.





















