RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
ఎన్నో నెల్లల నుంచి RCB టీమ్ ని ఎవరు కొనుగోలు చేస్తారు అన్న చర్చ ఉండేది. ఇప్పుడు ఆ సస్పెన్స్ వీడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడవడం సంచలనంగా మారింది. ఈ రెండు జట్ల విలువే ఇప్పుడు దాదాపు రూ. 28,000 కోట్లకు చేరింది.
ఐపీఎల్‌లో మోస్ట్ క్రేజీ టీమ్ అయిన ఆర్సీబీ యాజమాన్యం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సుమారు 1.78 బిలియన్ డాలర్ల ధరకు ఈ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ మరియు బ్లాక్‌స్టోన్ కూటమి దక్కించుకుంది. ఇందులో పురుషుల జట్టుతో పాటు మహిళల (WPL) టీమ్ కూడా భాగమే. ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఈ కొత్త బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
మరోవైపు తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కూడా రికార్డు ధర పలికింది. టెక్ దిగ్గజం కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 1.63 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. బిర్లా, బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజాల రాకతో ఐపీఎల్ బ్రాండింగ్ మరియు ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















