Indian Team Wicketkeeper Dhruv Jurel | టీంలో లక్కీ ప్లేయర్ గా మారిన ధృవ్ జురెల్ | ABP Desam
టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మ్యాచ్‌లను గెలిచిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ ఆల్డిన్ బాప్టిస్ట్ పేరు మీద ఉంది. బాప్టిస్ట్ తన టెస్ట్ కెరీర్‌లో 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలో తన టీం గెలిచింది. తన కెరీర్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దాంతో ఆల్డిన్ బాప్టిస్ట్ టీంలో ఉంటె టెస్ట్ మ్యాచ్ పక్కా గెలుస్తాం అన్న నమ్మకంతో ఉండేది వెస్టిండీస్. తనని ఒక అదృష్టం లాగా భావించారు. ఇప్పుడు సేమ్ సీన్ ఇండియా టీంలో కూడా రిపీట్ అవుతుంది. టీం ఇండియాలో ఉన్న అదృష్టం ఎవరో కాదు.. వికెట్ కీపర్ ధృవ్ జురెల్.
ధృవ్ ఆడిన ప్రతి మ్యాచ్ లో టీం ఇండియా గెలిచింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌తో టీం లో చోటు దక్కించుకున్న ధృవ్, టీమ్‌కే అదృష్టవంతుడిగా మారిపోతున్నాడు. జురెల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే ఇండియా అన్ని మ్యాచులో గెలిచింది. టెస్టులో జురెల్ ఇప్పటి వరకు ఓటమిని ఎదుర్కోలేదు. దాంతో ధృవ్ జురెల్ టీంలో లక్కీ ప్లేయర్ గా మారిపొయ్యాడు. ప్రతి టెస్ట్ సిరీస్ లో ధృవ్ జురెల్ ను ఖచ్చితంగా ఎంపిక చేయండంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















