India vs West Indies Test Series | ప్రాక్టీస్ సెషన్‌కి హాజరుకాని టీమిండియా స్టార్ ప్లేయర్ల | ABP Desam
ఆసియా కప్‌లో ఓటమనేదే లేకుండా డామినేటింగ్ పెర్ఫార్మెన్స్‌తో ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వెస్టిండీస్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కి రెడీ అయింది. సిరీస్‌లో ఈ రోజు గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మ్యాచ్ ముందు టీమిండియాలోని కీలక ప్లేయర్లు కనీసం ప్రాక్టీస్‌కి కూడా రాలేదట. జస్‌ప్రిత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ముగ్గురూ ప్రాక్టీస్ సెషన్‌కి అటెండ్ కాకుండానే నేరుగా మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యారు. అయితే దీనికి టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్ గౌతం గంభీర్ వ్యాలిడ్ రీజన్ కూడా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆసియా కప్ ఆడిన టీమిండియాలో బుమ్రా, అక్షర్, కుల్దీప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ట్రోఫీ గెలవడంలో కూడా కీ రూల్ పోషించారు. అలాగే టోర్నీ మొత్తం ఆడటంతో బాగా అలసిపోయి కూడా ఉంటారు. ఇలాంటి టైంలో కొద్ది రోజుల్లోనే మళ్లీ టెస్ట్ సిరీస్‌కి ఎంపిక కావడం.. దాని కోసం ప్రాక్టీస్ చేయడం అంటే వాళ్లకి రిలాక్స్ అయ్యే ఛాన్స్ దొరకదు. అందుకే ఆల్రెడీ ఫామ్‌లో ఉన్న వాళ్లు ముగ్గురికీ ప్రాక్టీస్ నుంచి కొద్దిగా మినహాయింపునివ్వాలని మేనేజ్‌మెంట్, కోచ్ గంభీర్ అనుకున్నారు’ అని బీసీసీఐకి చెందిన ఓ అఫీషియల్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. టెస్ట్ సిరీస్ ఆడబోతున్న టీమ్‌లో బుమ్రా, అక్షర్, కుల్దీప్‌తో పాటు గిల్ ఒక్కడే ఆసియా కప్ ఆడిన టీమ్‌లో ఉన్నాడు. అయితే గిల్ కెప్టెన్ కాబట్టి.. రెస్ట్ తీసుకోకుండానే టీమ్ ప్రాక్టీస్‌లో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ రోజు గురువారం నుంచి ఇండియా, వెస్ట్ ఇండీస్ తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. మరి ఒకవేళ బుమ్రా, అక్షర్, కుల్దీప్ ఫైనల్ లెవెన్‌లో సెలక్ట్ అయితే.. ప్రాక్టీస్ లేకుండా వీళ్లెలా ఆడతారో..? అండ్ రీసెంట్‌గా నేపాల్ చేతిలో ఘోరంగా ఓడి సిరీస్ కూడా పోగొట్టుకున్న విండీస్‌పై ఎలాంటి డామినెన్స్ చూపిస్తారో చూడాలి.





















