Ind vs Wi Mohammad Siraj | విండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్‌కి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ సిరీజ్ | ABP Desam
ఇండియా, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ టెయిలెండర్లు ఇండియన్ బౌలర్ల పేషెన్స్‌కి పరీక్ష పెట్టారు. దీంతో ఫ్రస్ట్రేట్ అయిన మన డీఎస్పీ సిరాజ్ సాబ్.. ఏకంగా విండీస్ బ్యాటర్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. విండీస్‌తో ఆడుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఫస్ట్ టెస్ట్‌లో ఏకంగా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ టీమ్‌ని చిత్తుగా ఓడించడమే కాకుండా.. రెండో టెస్ట్‌లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 518/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి.. 270 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 248 రన్స్‌కే ఆలౌట్ అయిన విండీస్‌కి ఈ స్కోరే సరిపోతుందని కెప్టెన్ గిల్ అనుకున్నాడు. అనుకున్నట్ల.. విండీస్ బ్యాటింగ్ స్టార్ట్ కాగానే వికెట్ల పతనం మొదలైంది. ఇక లాస్ట్ వికెట్ అవుట్ చేస్తే ఇండియా గెలిచేసినట్లే అనుకుంటున్న టైంలో.. 10వ వికెట్ జేడెన్ సీల్స్‌తో కలిసి.. ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన ఆటతో ఇండియన్ బౌలింగ్ యూనిట్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. 85 బంతుల్లో 50 రన్స్‌తో హాఫ్ సెంచరీ చేసి సెషన్ మొత్తం వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశాడు. ఇంకోపక్క సీల్స్ కూడా తన టెస్ట్ కెరీర్లో హయ్యస్ట్ స్కోర్ 32 ఈ మ్యాచ్‌లోనే కొట్టడం విచిత్రం. ఇక వీళ్లిద్దరి ఆటతో ఫుల్లుగా ఫ్రస్ట్రేట్ అయిన మన మియా భాయ్.. ఏకంగా గ్రీవ్స్ దగ్గరికెళ్లి వార్నింగే ఇచ్చేశాడు. నాలుగో రోజు ఆఖరి సెషన్ మొదలయ్యే ముందు.. గ్రీవ్స్ దగ్గరికెళ్లిన మియా భాయ్.. ‘నువ్వు స్కోర్ చేయడం అపుతావా? లేదా..?’ అన్నట్లు వార్నింగ్ ఇస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సిరాజ్ వార్నింగ్‌ని క్యాజువల్‌గా తీసుకున్న గ్రీవ్స్.. ఆఖరి సెషన్‌లో కూడా కొద్ది సేపు ఇండియన్ బౌలర్లని ఇబ్బంది పెట్టాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో సీల్స్ అవుట్ కావడంతో.. విండీస్ ఇన్నింగ్స్‌కి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఆఖరి వికెట్‌కి గ్రీవ్స్, సీల్స్ కలిసి చేసిన 79 పరుగులు పార్ట్‌నర్‌షిప్ స్కోర్.. ఏకంగా మొత్తం సిరీస్‌లోనే విండీస్ తరపున రెండో హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్ కావడం విచిత్రం.





















