Ind vs WI 2nd Test Day 2 Highlights | జడ్డూ మ్యాజిక్ తో ప్రారంభమైన విండీస్ పతనం | ABP Desam
రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా టీమిండియా తన ప్రయాణం అయితే ప్రారంభించింది. మొదటి టెస్టులో సూపర్ విక్టరీ తర్వాత రెండో టెస్టును ప్రారంభించిన యువభారత్...రెండు రోజుల ఆట ముగిసే సమయానికి పటిష్ఠ స్థితిలో నిలబడింది. మొదటి రోజున్నర ఆటలో భారత్ దే ఆధిపత్యం కాగా యంగ్ గన్ యశస్విజైశ్వాల్ 175పరుగులు, కెప్టెన్ శుభ్ మన్ గిల్ 129పరుగులతో నాటాట్ గా నిలవటంతో 5వికెట్ల నష్టానికి 518పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. విండీస్ ఉన్న ఫామ్ కి మొదటి ఇన్నింగ్స్ లో తేలిపోతారు అనిపించినా పర్లేదు బాగానే ప్రతిఘటించారు అనుకోవాలి.... రీజన్...రెండో రోజు 43ఓవర్లు ఆడిన వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 140పరుగులు చేసింది. తక్కువ స్కోరులానే కనిపించినా ఓపెనర్ చందర్ పాల్ 34, వన్ డౌన్ బ్యాటర్ అథనేజ్ 41 పరుగులు చేసి ఔట్ అయితే, హోప్ 31పరుగులతో ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాస్తవానికి బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్ లాంటి బౌలింగ్ లైనప్ ముందు విండీస్ ఉన్న ఫామ్ కి ఈ పరుగులు చేయటం కూడా ప్రతిఘటనే అని చెప్పుకోవాలి. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జడ్డూ మ్యాజిక్ చూపించి 3వికెట్లు తీయగా.,,కుల్దీప్ ఒక వికెట్ తీయటంతో భారత్ మళ్లీ ఆధిపత్యం సాధించింది. అంతగా బంతి టర్న్ అవ్వని..పెద్దగా బౌన్స్ కూడా రాకుండా బ్యాటర్లకు సహకరిస్తున్న పిచ్ మూడో రోజు టీమిండియా బౌలర్లు సెట్ అయిన బ్యాటర్లను ఎంత త్వరగా పెవిలియన్ కి పంపించి వాళ్లతో ఫాలో ఆన్ ఆడిస్తారనే దానిపైనే రెండో టెస్టులో భారత్ ఎంత త్వరగా విజయం అందుకుంటుందో డిపెండ్ కానుంది.





















