Ind vs Pak Abhishek Sharma | T20 World Cup 2026 హై ఓల్టేజ్ మ్యాచ్ కి ముందు షాకులు | ABP Desam
ఫిబ్రవరి 15..టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న క్షణం. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అతిపెద్ద మ్యాచ్ ఇదే. పాకిస్తాన్ ను టీమిండియా ఢీకొట్టే సందర్భం. కొలంబో వేదికగా శివరాత్రి రోజు జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్స్ కసిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా భారత్ ను ఢీకొట్టడం పాక్ కు అంత ఈజీగా కాకపోయినా...పాక్ ను అంత తక్కువగా అంచనా వేయలేం. ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ కి వచ్చిన పాకిస్తాన్...తమ స్పిన్నర్లతో వరల్డ్ కప్ లోనూ హల్ చల్ చేస్తోంది. అయితే ఇదే టైమ్ లో భారత్ ను కాస్త కలవర పెడుతున్న అంశం. పులి లాంటి ఓపెనర్ అభిషేక్ శర్మ హెల్త్. ఇప్పటికే నమీబియాతో జరిగిన మ్యాచ్ కు దూరమైన అభిషేక్ శర్మ...పాక్ తో మ్యాచ్ లోపు కోలుకుంటాడా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ కి ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్నా ఇప్పటికీ బీసీసీఐ అతని హెల్త్ మీద అప్డేట్ ఇవ్వలేదు. అర్ష్ దీప్ సింగ్ షేర్ చేసిన ఓ రీల్ లో మాత్రం నీరసంగానే కనిపించిన అభిషేక్...తను బాగానే ఉన్నానని ఫ్యాన్స్ కి చెప్పాడు. బట్ పాక్ మీద మ్యాచ్ కోసం అతను ఫిట్నెస్ సాధించకపోతే సంజూ శాంసన్ కు మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. చూడాలి ఇంకా ఇరవైనాలుగు గంటల టైమ్ ఉంది కాబట్టి అభిషేక్ కోలుకుంటాడేమో. మరో వైపు టీమిండియా మేనేజ్మెంట్ ఓ కీలక బౌలింగ్ ఛేంజ్ కూడా కోరుకుంటోంది. కొలంబోలోని ప్రేమదా స్టేడియం సంప్రదాయ స్పిన్ పిచ్ కాబట్టి...బ్యాటర్ ను తగ్గించుకోకుండా ఓ పేసర్ ను తగ్గించుకోవాలని భావిస్తోంది భారత్. అదే ఫైనల్ డెసిషన్ అనుకుంటే...లెఫార్మ్ పేసర్ అర్ష్ దీప్ కు రెస్ట్ ఇచ్చి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కి తోడుగా కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. బుమ్రాతో పాటు హార్దిక్ మాత్రేమ పేస్ బాధ్యతలు చూసుకోవాలి అప్పుడు. చూడాలి...టీమిండియా పాకిస్తాన్ పై హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగనుందో.
ట్రెండింగ్ వార్తలు





















