Ind vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam
92 ఏళ్ల చరిత్ర...584 టెస్టుల అనుభవం...స్వదేశం అంటే చాలు టీమిండియా బెబ్బులి. సంప్రదాయ స్పిన్ పిచ్ లపై మనల్ని కొట్టినోడే లేడు. మహామహులు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా,ఇంగ్లండ్ మన దేశంలో సిరీస్ లు గెలుచుకున్నాయి కానీ ఎప్పుడూ మనల్ని వైట్ వాష్ చేయలేకపోయాయి. ఇన్నేళ్లుగా ఏ టీమ్ సాధించని ఘనత ఆ రికార్డు ఈ రోజు ముక్కులైపోయాయి. మూడో టెస్టులో న్యూజిలాండ్ విసిరిన 147పరుగుల లక్ష్యాన్ని చేధించలేక రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగులకే ఆలౌట్ అయిపోయింది టీమిండియా. ఫలితంగా 25పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో అవమానకరీతిలో ఓటమి ఎదుర్కోవటమే కాదు. 0-3 తేడాతో భారత్ ను చిత్తు చేసి వైట్ వాష్ కూడా చేశాయి. ఇప్పటివరకూ ఏ జట్టు కూడా ఇండియాలో ఆడి ఇండియాను ఓ టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ చేయలేకపోయాయి. అలాంటిది తొలిసారి మూడు టెస్టు మ్యాచుల సిరీస్ లో మూడు కు మూడు గెలుచుకుని న్యూజిలాండ్ సరికొత్త చరిత్రను లిఖించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మూడు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణించి భారత్ పతనాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5వికెట్లు తీసిన అజాజ్ పటేల్..రెండో ఇన్నింగ్స్ లో 6వికెట్లు తీసి భారత్ ను ఘోరంగా ఓడించాడు. ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడాల్సిన టీమిండియాకు ఇది ఊహించలేని దారుణమైన ఓటమి.