అన్వేషించండి

Ind vs Ban Super 8 Match Highlights | బంగ్లాదేశ్ పై 50పరుగుల తేడాతో భారత్ జయభేరి | ABP Desam

 టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో పాకిస్థాన్ ను ఇంటిదారి పట్టేలా చేసిన భారత్...నిన్న ఒకప్పటి ఈస్ట్ పాకిస్థాన్  అదేనండీ బంగ్లాదేశ్ ను కూడా ఇంటి దారి పట్టేలా చేశారు మన టీమిండియా హీరోలు. వెస్టిండీస్ లోని ఆంటిగ్వా ఐలాండ్ లో జరిగిన టీ20 వరల్డ్ సూపర్ 8 గ్రూప్ A మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది మన భారత్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ నిర్ణయం తప్పని తేలేలా మొదటి బంతి నుంచే భారత్ విరుచుకు పడింది. ప్రత్యేకించి ఈ వరల్డ్ కప్ లో ఇన్నాళ్లూ ఫెయిల్ అవుతూ వస్తున్న మన ఓపెనర్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కొహ్లీ నిన్న మ్యాచ్ లో అదరగొట్టేశారు. రోహిత్ 11 బాల్స్ లోనే 3ఫోర్లు 1సిక్సర్ తో 23పరుగులు చేస్తే..కింగ్ విరాట్ కొహ్లీ 28బంతుల్లో 1ఫోరు 3సిక్సర్లతో 37పరుగులు చేశారు. వీరిద్దరూ త్వరగానే అవుటైనా మ్యాచ్ కి కావాల్సిన ఇగ్నిషన్ ను అందించారు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ 36పరుగులను తన దైన స్టైల్ లో బాదేశాడు. అన్నింటికంటే హైలెట్ అంటే శివమ్ దూబే-హార్దిక్ పాండ్యా పార్టనర్ షిప్. ఈ సీజన్ లో ఇప్పటివరకూ బ్యాట్ ఝుళిపించిన దూబే నిన్న 3సిక్సులు బాది 34పరుగులు చేశాడు. కొంచెం స్లో ఇన్నింగ్స్ అయినా మునుపటి తో పోలిస్తే బెటర్ అనిపించింది. ఇక మన మైటీ ఆల్ రౌండర్ పాండ్యా అయితే హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 27బాల్స్ లోనే 4ఫోర్లు 3సిక్సర్లతో సరిగ్గా 50పరుగులు చేయటంతో పాటు టీమిండియా స్కోరును 196పరుగులకు తీసుకువెళ్లటంతో పాండ్యాదే కీరోల్. ఇక 197పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ బాగానే ఆడింది. ముఖ్యమంగా లిటన్ దాస్, నజ్ముల్ శాంటో టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నమైతే చేశారు. అయితే పాండ్యా లిటన్ దాస్ ను అవుట్ చేయటంతో మొదలైన పతనం ఇక ఆగలేదు. కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా బంగ్లా బౌలర్లను క్రష్ చేసేశారు. కుల్దీప్ 4ఓవర్లలో 19పరుగులే 3వికెట్లు తీస్తే..మన బూమ్ బూమ్ బుమ్రా 4ఓవర్లలో 13పరుగులే ఇచ్చి 2వికెట్లు తీసి తన పిసినారి తనాన్ని మరోసారి చాటుకున్నాడు. అర్ష్ దీప్ సింగ్ కూ రెండు వికెట్లు తీయటంతో బంగ్లాదేశ్ 8వికెట్ల నష్టానికి 146పరుగులే చేయగలిగింది. ఫలితంగా భారత్ 50పరుగుల విజయాన్ని అందుకోవటంతో పాటు టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ బెర్త్ ను దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంది. హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ పైన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు

క్రికెట్ వీడియోలు

Rishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABP
Rishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABP
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget