Eng vs Ind Second test Bowlers Dominance | సిరాజ్, ఆకాశ్ దీప్ రప్పా రప్పాకు కుప్పకూలిన ఇంగ్లండ్ | ABP Desam
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టును ఆసక్తికరంగా మార్చారు ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్. ఇద్దరూ భారీ సెంచరీలు బాదటంతో అది కూడా వన్డే స్టైల్ లో ఇంగ్లండ్ కూడా భారత్ కు దీటుగా స్కోరు చేయగలిగింది. హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేసి అవుట్ అయితే..కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ మాత్రం ఇంగ్లండ్ ఆలౌట్ అయినా తను మాత్రం 184 పరుగులతో నాటాట్ గా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 303 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆ జట్టు 407పరుగులు చేయగలిగేలా చేశారు. కానీ ఈ ఇద్దరి ఆటను మినహాయిస్తే ఇంగ్లండ్ స్కోరు బోర్డు చూస్తే దారుణం. ఈ ఇద్దరి భారీ సెంచరీల తర్వాత స్కోరు బోర్డులో హయ్యెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా జో రూట్ కొట్టిన 22 పరుగులు, దాని తర్వాత జాక్ క్రాలీ 19 పరుగులు, క్రిస్ వోక్స్ 5 పరుగులు అంతే. మిగిలిన టీమ్ అంతా డకౌట్లే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు డకౌట్లు ఉన్నాయి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో. బెన్ డకెట్, ఓలీ పోప్ ను ఆకాశ్ దీప్ డకౌట్ చేస్తే...బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్ లను సిరాజ్ డకౌట్ చేశాడు. బాజ్ బాల్ జమానా మొదలైన తర్వాత ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్ లో ఇన్ని డకౌట్లు ఇదే ఫస్ట్ టైమ్. అంతే కాదు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 400 పరుగులకు పైగా ఓ జట్టు నమోదు చేసినప్పుడు 6 డకౌట్లు ఇన్నింగ్స్ లో ఉండటం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అట. మన బౌలర్ల డామినెన్స్ ఆ రేంజ్ లో సాగింది. ఆ ఇద్దరి భారీ సెంచరీలను మినహాయిస్తే మన బౌలర్లు దుమ్ము రేపారు. మొదటి 21 ఓవర్లలో 84 పరుగులకే 5 వికెట్లు తీసిన సిరాజ్ ఆకాశ్ దీప్...తర్వాత బ్రూక్, జేమీ స్మిత్ విధ్వంసంతో 61 ఓవర్లలో 303 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయారు. కానీ చివరి 7ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం మాత్రం అద్భుతం. కీలక బ్యాటర్లు అంతా అయిపోయినా తోకను పడగొట్టడంతో మనోళ్లు వీక్ అనే మాటను చాన్నాళ్ల తర్వాత తప్పు అని ప్రూవ్ చేశారు ఆకాశ్ దీప్ అండ్ మహ్మద్ సిరాజ్.





















