Eng vs Ind Fourth Test Day 3 Highlights | భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్న ఇంగ్లండ్ | ABP Desam
పదేళ్ల తర్వాత భారత్ విదేశాల్లో తొలిసారి 500 పరుగులు సమర్పించుకుంది. భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. అది ఎంతటి భారీ ఇన్నింగ్స్ ఇప్పటికే ఇంగ్లండ్ 7వికెట్ల నష్టానికి 544పరుగులు చేసింది. ఇంకా స్టోక్స్, డాసన్ ఆడుతున్నారు. క్రాంప్స్ వచ్చినా కూడా పట్టు వదలకుండా ఆడుతున్న కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇప్పటికే 77పరుగులు చేశాడు. లియామ్ డాసన్ 21పరుగులు చేశాడు. అన్నింటి కంటే ముఖ్యంగా జో రూట్ మరోసారి సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఏకంగా 150 పరుగులు చేసిన రూట్ టెస్టుల్లో 38 వ సెంచరీ బాదేసి సచిన్ టెండూల్కర్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన లాంగ్ ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి భారత్ పై భారీ స్కోరు వేసే దిశగా రూట్ చూపించాడు రూట్. భారత బౌలర్లు ఎంత కష్టపడుతున్నా వికెట్లు అయితే తీయలేకపోతున్నా. వాషింగ్టన్ సుందర్, జడ్డూ రెండేసి వికెట్లతో మధ్యలో బ్రేక్ ఇవ్వకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. మొత్తంగా పదేళ్ల తర్వాత టీమిండియా విదేశాల్లో ప్రత్యర్థి జట్టుకు 500లకు పైగా సమర్పించుకోవటం ఇదే తొలిసారి. చివరి సారిగా 2015-16 ఆస్ట్రేలియా మీద మనోళ్లు 572పరుగులు సమర్పించుకున్నారు. కొహ్లీ, రోహిత్ కెప్టెన్సీల్లో మరోసారి 500మార్క్ దాటకుండా మన బౌలర్లు ఇన్నాళ్లూ విదేశీ పిచ్ ల పై విరుచుకుపడ్డారు కానీ ఇప్పుడు కెప్టెన్ గిల్ గారి జమానాలో అది కూడా అర్పణం అయిపోయింది.



















