Eng vs Ind Dukes Ball Controversy | ఇంగ్లండ్ ఇండియా సిరీస్ లో డ్యూక్స్ బాల్స్ రచ్చ | ABP Desam
ఇంగ్లండ్ ఇండియా సిరీస్ లో ఆటగాళ్ల ప్రతిభపై కాకుండా ప్రధానంగా చర్చ నడుస్తోంది బౌలర్లు విసిరే బాల్స్ పైన. అవును డ్యూక్ బాల్స్ బౌలర్లను విసిగెత్తిస్తున్నాయి. అంపైర్ ని బతిమాలుకుని కొత్త బాల్ తీసుకున్నా సరే పట్టుమని పది ఓవర్లు వేయకముందే షేప్ అవుట్ అయిపోయి బ్యాటర్లకు సహకరిస్తున్నాయనేది ఇంగ్లండ్, భారత్ జట్ల బౌలర్లు ఇద్దరూ చేస్తున్న వాదన. ప్రధానంగా ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో వాడే డ్యూక్ బాల్స్ పైనే ఈ చర్చంతా. పది ఓవర్లు కూడా వేయకముందే బాల్ గతి తప్పిపోయి సీమ్ కు సహకరించటం లేదని ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ అంపైర్లతోనే వాదిస్తూనే కనిపించారు. కెప్టెన్ గిల్ అయితే అంపైర్లతో సుదీర్ఘంగా వాదనకు దిగాడు. కానీ లాభం లేదు. అంపైర్లు బాల్ చెక్ చేయటం బాగానే ఉంది అనటం..బౌలర్లు గోల పెట్టడం ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. ఇంగ్లండ్ ఆల్ అవుట్ అయ్యాక భారత బ్యాటింగ్ చేస్తున్న టైమ్ లో ఆర్చర్, స్టోక్స్ కూడా అంపైర్ తో బాల్ గురించి కంప్లైంట్ చేయటంతో ఈ బాల్స్ లోనే ఏదో మతలబు ఉందని అందరకీ అర్థమైంది. బుమ్రా కూడా మ్యాచ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ లో అదే చెప్పాడు. ఇప్పుడు డ్యూక్ బాల్స్ గురించి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి నేను మ్యాచ్ ఫీజులో కోతలు వేయించుకోలేన్న బుమ్రా..తను వేసే ఓవర్లు బంతులు అన్నీ విలువైననవేననీ కానీ..ఇచ్చిన బంతితోనే బౌలింగ్ చేయక తప్పటం లేదని..దాని గురించి ఎవరైనా ఆలోచిస్తుందే బాగుంటుందని అన్నాడు. సేమ్ అదే అభిప్రాయాన్ని స్టోక్స్ కూడా వ్యక్తం చేశాడు. కానీ డ్యూక్స్ బాల్స్ తయారీ చేసే కంపెనీ బ్రిటీష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ మాత్రం ఈ వాదనలను కొట్టి పారేస్తున్నారు. ఫ్లాట్ పిచ్ లు తయారు చేసుకోవటం...బ్యాటర్లకు అనుకూలంగా రూల్స్ పెట్టుకోవటం..నాణ్యత లేని బౌలర్లను ఆడించుకోవటం లాంటి కారణాలను తామెప్పుడూ చెప్పలేదు కదా..అవెంత ఇంపాక్ట్ చూపిస్తాయో తమ కంపెనీ తయారు చేసే బంతులు కూడా అంతే ఇంపాక్ట్ ఉంటాయంటూ కుండ బద్ధలు కొట్టారు డూక్స్ బాల్స్ తయారీదారులు.





















