Eng vs Ind 5th Test 2nd Day India Bowling | ఊహించలేని బంతులతో ఇంగ్లండ్ ను వణికించిన Siraj, Prasidh | ABP Desam
ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ ఈ రోజు వరకూ అద్భుతంగా రాణించింది. పేపర్ పై ఫలితం ప్రస్తుతానికి 2-1 గా ఇంగ్లండ్ కు ఆధిక్యంలో కనపడుతున్నా ఏ మ్యాచ్ లో కూడా భారత్ తగ్గింది లేదు. కానీ ఐదో టెస్ట్ మ్యాచ్ ను భారత్ తప్పనిసరిగా గెలిస్తేనే ఈ కష్టానికి కనీస ఫలితం సిరీస్ డ్రా రూపంలో దక్కుతుంది. అది జరగాలంటే ఇంగ్లండ్ బ్యాటర్లను కంట్రోల్ చేయగలగాలి. ఆ పనిని సమర్థంగా పూర్తి చేశారు మన పేసర్లు మహమ్మద్ సిరాజ్...ప్రసిద్ధ్ కృష్ణ. ఫస్ట్ ఇన్నింగ్స్ లు పూర్తయ్యేటప్పటికి ఇంగ్లండ్ కేవలం 23 పరుగుల ఆధిక్యానికి మాత్రమే పరిమితం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. రీజన్ ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓ దశలో 129పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఆ టైమ్ లో ఇంగ్లండ్ ను మరో వంద పరుగులకే ఆలౌట్ అయిపోయేలా చేశారు అంటే భారత్ బౌలర్లు మ్యాజిక్ చేశారనే అర్థం చేసుకోవాలి. ఇంగ్లండ్ ట్రెడీషినల్, డిఫెన్సివ్ మోడ్ లో ఆడటం లేదు. ప్రతీ బాల్ షాట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బాజ్ బాల్ గేమే అది. అందుకే భారత బౌలర్లు కూడా లంచ్ బ్రేక్ లో వ్యూహం మార్చారు. బాడీ లాంగ్వేజ్ తో ఇబ్బంది పెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లపై మాటల దాడికి దిగి వాళ్ల కాన్సస్ట్రేషన్ ను దారుణంగా డ్యామేజ్ చేశారు. ఓపెనర్ బెన్ డకెట్ ను రెచ్చగొట్టి ఆకాశ్ దీప్ వికెట్ అలాగే పడగొట్టాడు. జాక్ క్రాలీ వికెట్ తీయటంతో ప్రసిద్ధ్ కృష్ణ లైన్ లోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత మియా భాయ్ వంతు. నిప్పులు చెరిగే బంతులతో దుమ్ము రేపాడు. బుమ్రా లేని లోటు అస్సలు కనపడకుండా లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ తో ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగేలా చేశాడు. సిరాజ్ తీసిన నాలుగు వికెట్లు ఒకటి క్లీన్ బౌల్డ్, మూడు ఎల్బీడబ్య్లూ లు అంటే అర్థం చేసుకోవచ్చు. యుద్ధం జరిగింది సిరాజ్ కి, ఇంగ్లండ్ బ్యాటర్లకు మాత్రమే. ఫీల్డర్లకు పనే లేదు. కెప్టెన్ ఓలీ పోప్, సూపర్ బ్యాటర్ జో రూట్, హ్యారీ బ్రూక్, బెత్ హెల్ ఇలా ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్ ను సిరాజ్ భాయ్ ఇంటికి పంపిస్తే..లోయర్ మిడిల్ అండ్ టెయిలెండర్లను ప్రసిద్ధ్ కృష్ణ చూసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా నాలుగు వికెట్లు తీయటంతో..ఓ వైపు మహమ్మద్, మరో వైపు కృష్ణ కలిసి ఇంగ్లండ్ కి దేవుడు కనిపించేలా చేశారన్న మాట. ఫలితంగా ఇంగ్లండ్ అస్సలు అనుకోని విధంగా 247పరుగులకే ఆలౌట్ అయ్యి..23పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించగలిగింది.





















