Dream 11 steps down As team India Sponsor టీమిండియా జర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగిన డ్రీమ్ 11 | ABP Desam
రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడంతో ఇప్పుడు టీమిండియా ఎలాంటి జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు, 2025 ప్రకారం.. ఆన్‌లైన్‌లో రియల్ మనీ గేమ్స్ ఆడించే డ్రీమ్ 11, మై11 సర్కిల్, ఎంపీఎల్ లాంటి అన్ని యాప్స్ బ్యాన్ అయిపోయాయి. దీంతో ఈ యాప్స్ అన్నీ.. ఇకపై వాళ్ల యాప్స్‌లో రియల్ మనీ కాంటెస్ట్‌లు కండక్ట్ చేయలేవు. దీంతో వాటి ఇన్‌కం దాదాపు ఆగిపోయింది. దీనివల్ల సదరు సంస్థలన్నీ కాస్ట్ కటింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. అందులో భాగంగానే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 కూడా.. టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి వెనక్కి తగ్గాలని డిసైడ్ అయి ఆదివారం బీసీసీఐకి ఈ విషయం చెప్పగా.. ఈ రోజు బీసీసీఐ అఫీషియల్‌గా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. డ్రీమ్ 11.. 2023 నుంచి టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉంది. తమ లోగో ఉన్న జెర్సీతో టీమిండియా ఆడుతున్నందుకు గానూ.. స్వదేశంలో ఆడే ప్రతి మ్యాచ్‌కు ₹3 కోట్లు, విదేశాలలో ఆడే ప్రతి మ్యాచ్‌కు ₹1 కోటి చొప్పున బీసీసీఐకి చెల్లిస్తోంది డ్రీమ్ 11. అంటే ఆసియా కప్ మొదలు కావడానికి ఇక కేవలం రెండు వారాలే మిగిలి ఉండటంతో.. బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం బిడ్స్ పిలవడానికి రెడ అవుతోందట. అయితే ఒకవేళ వెంటనే స్పాన్సర్ దొరక్క పోతే.. ఆసియా కప్ 2025లో జెర్సీ స్పాన్సర్ లేకుండనే టీమిండియా బరిలోకి దిగాల్సి రావచ్చు. మరి జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతుందా? లేదంటే కొత్త స్పాన్సర్ వెంటనే దొరుకుతారా..? అనేది చూడాలి.





















