Aus vs Ind Super 8 | 2023 వన్డే వరల్డ్ కప్ కి ప్రతీకారం 2024 టీ20 వరల్డ్ కప్ లో | T20 World Cup 2024
ప్రతీ భారత అభిమాని మర్చిపోలేని బాధ 2023 వన్డే వరల్డ్ కప్. రోహిత్ శర్మ అయితే ఎమోషన్ ను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. అస్సలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆ వరల్డ్ కప్ లో ఫైనల్ కు దూసుకొచ్చిన టీమిండియాను సొంత గడ్డపైనే కొట్టింది ఆస్ట్రేలియా. మాములుగా కూడా కాదు చెప్పి మరీకొట్టి కొట్టాడు ఆ వరల్డ్ కప్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సైలెంట్ చేయటంలో వచ్చే మజాను ఎంజాయ్ చేశారు వాళ్లు. ఇప్పుడు దానికి రివెంజ్ టైమ్ వచ్చింది. అదే వరల్డ్ కప్ లో తమ చేతుల్లో నుంచి విక్టరీని లాగేసుకున్న ఆస్ట్రేలియాను గుర్తుపెట్టుకుని మరీ నిన్న అఫ్గనిస్థాన్ ఎలా అయితే షాక్ ఇచ్చిందో అదే అవకాశం ఇప్పుడు మనకు కూడా ఉంది. కసిగా ఆడి ఆసీస్ ను ఓడిస్తే చాలు...కంగారూలు సూపర్ 8 దశలోనే ఇంటిదారి పట్టే అవకాశాలు కల్పించిన వాళ్లం అవుతాం. కారణంగా ఆఫ్గానిస్థాన్ కి నెక్ట్స్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఉంది. ఆ మ్యాచ్ లో ఆఫ్గాన్ గెలిస్తే చాలు కాబూలీలు సెమీస్ కు వస్తారు కంగారూలు ఇంటికిపోతారు. సో ఈ సినారియోను క్రియేట్ చేయాలి అంటే టీమిండియా ఈరోజు మ్యాచ్ లో గెలిచి తీరాలి. అయితే వర్షం అడ్డుపడే అవకాశం ఉందని అని చెప్తున్న ఈ మ్యాచ్ లు ఇరు టీమ్స్ పేపర్ మీదైతే సమ ఉజ్జీల్లా కనిపిస్తున్నాయి. మన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల్లానే వాళ్ల ఓపెనర్లు హెడ్, వార్నర్ మావ వాళ్ల స్థాయిలో ఆడట్లేదు. ఆఫ్గాన్ మీద హెడ్ డకౌట్ అయ్యాడు. ఇక మనకు సూర్యకుమార్ యాదవ్, పంత్, పాండ్యా ఆదుకుంటున్నట్లు వాళ్లను స్టాయినిస్, మ్యాక్స్ వెల్, కెప్టెన్ మిచ్ మార్ష్ తలో చేయి వేసి ఆదుకుంటున్నారు. బౌలింగ్ లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఆఫ్గాన్ మ్యాచ్ లో ఆడని స్టార్క్ మన మీద మ్యాచ్ లో తిరిగి వస్తాడు. ప్యాట్ కమిన్స్ రెండు మ్యాచుల్లో రెండు హ్యాట్రిక్ లతో జోరు మీదున్నాడు. ఆస్టిన్ అగర్, జంపా స్పిన్ బాధ్యతలను చూసుకుంటున్నారు. మన బౌలింగ్ లోనూ అంతే పాండ్యా, అర్ష్ దీప్ వికెట్లు సాధిస్తుంటే..బుమ్రా అంతుచిక్కని డెలెబ్రీలతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. జడ్డూ, అక్షర్, కుల్దీప్ టచ్ లోనే కనపడుతున్నారు కాబట్టి ఒక్క మ్యాచ్ ఆసీస్ మ్యాచులో అందరూ సమష్ఠిగా ఆడితే చాలు..కంగారూలు ఇక కాబూలీలు బంగ్లాపులులపై ఓడిపోవాలని పూజలు చేసుకునే సిచ్యుయేషన్ క్రియేట్ చేసిన వాళ్లం అవుతాం మనం