Asia Cup 2025 IND vs UAE | యూఏఈపై టీమిండియా రికార్డ్ విక్టరీ | ABP Desam
ఆసియా కప్ 2025లో టీమిండియా రికార్డ్ విక్టరీతో స్టార్ట్ చేసింది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఇరగదీశారు. కుల్దీప్ 4, శివమ్ దూబే 3 వికెట్లతో రెచ్చిపోవడంతో యూఏఈ బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా తన ఫస్ట్ ఓవర్లోనే కుల్దీప్ యాదవ్.. కెప్టెన్ మహమ్మద్ వసీంతో పాటు రాహుల్ చోప్రా, హర్షిత్ కౌశిక్‌లని అవుట్ చేసి యూఏఈ బ్యాటింగ్ లైనప్‌ని కుప్ప కూల్చేశాడు. ఆ దెబ్బకి యూఏఈ మళ్లీ కోలుకోలేకపోయింది. మొత్తం 2.1 ఓవర్లు వేసిన కుల్దీప్.. 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌కి తోడు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శివమ్ దూబే కూడా 3 వికెట్లు తీయడంతో యూఏఈ అత్యంత దారుణంగా 13.1 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. యూఏఈ బ్యాటింగ్ లైనప్‌లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు 22 రన్స్, కెప్టెన్ మహ్మద్ వసీమ్ 19 ర్స్ తప్ప ఇంకొక్కరు కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారంటే మన బౌలర్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో అర్థం చేసుకోండి. ఇక ఈ స్కోర్‌ని టీమిండియా బ్యాటర్లు ఊదేశారు. అభిషేక్ శర్మ 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో రెచ్చిపోవడంతో 30 రన్స్ బాది అవుట్ కాగా.. మిగిలిన 28 రన్స్ టార్గెట్‌ని శుభ్‌మన్ గిల్ 20, సూర్యకుమార్ 7 పూర్తి చేశారు. మొత్తానికి 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి టీమిండియా 60 రన్స్ కొట్టి టార్గెట్‌ని ఛేజ్ చేయడమే కాకుండా.. ఆసియా కప్ 2025లో రికార్డ్ విక్టరీ కూడా సొంతం చేసుకుంది. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇండియా నెక్ట్స్ మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడబోతోంది. మరి ఆ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఇదే రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి బంపర్ విక్టరీ సాధించాలని కోరుకుందాం.





















