Ashwin on IPL Retirement and Dhoni | రెండు నెలల IPL కోసం..10నెలల వెయిటింగ్ నావల్ల కాదు | ABP Desam
ఉన్నపళంగా ఐపీఎల్ కు రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు అశ్విన్. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడిన అశ్విన్ ను రాజస్థాన్ ట్రేడ్ చేసుకోవాలని అందుకు బదులుగా సంజూ శాంసన్ ను చెన్నైకి ఇవ్వాలని సీఎస్కే పెట్టిన బేరం ఎటూ తెగక పోవటంతో అశ్విన్ ఓ డెసిషన్ తీసుకున్నాడు. ఇటు చెన్నైకి భారం కాకుండా అటు తనలో ఇంకా మిగిలి ఉన్న క్రికెటర్ కి అన్యాయం జరగకుండా ఐపీఎల్ కి రిటైర్మెంట్ బెటర్ అని డిసైడ్ అయ్యాడట. తన యూట్యూబ్ ఛానల్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు అశ్విన్. సురేష్ రైనా, ఇర్పాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ సహా అనేక మంది క్రికెటర్లు విదేశీ క్రికెట్ లీగుల్లో ఆడుకుంటూ మంచిగా తమలోని క్రికెటర్ కి పని పెడుతున్నారని...ఇప్పుడు తను ఐపీఎల్ కోసం కూర్చుంటే రెండు నెలల సీజన్ కోసం పదినెలలు ఖాళీగా ఉండాలని ఇది తనకు అస్సలు ఇష్టం లేదన్నాడు అశ్విన్. అంతే కాదు ఇదే విషయమై ధోని గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతానని చెప్పిన అశ్విన్...అతనికున్న క్రేజ్ విదేశీ లీగుల్లో ఆడితే కోట్లాది రూపాయలు వస్తాయని తెలిసినా కేవలం రెండు ఐపీఎల్ కోసం ఏడాదంతా వెయిట్ చేస్తున్నాడని ఇది తనకు ఎప్పటికీ అర్థం కాని విషయమన్నాడు అశ్విన్.





















