Pakistan Prime Minister Imran Khan కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇమ్రాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ రావాలంటే 172 సీట్లు ఉండాలి. అవిశ్వాస తీర్మానంలో 174 ఓట్లు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా రావడంతో ఆయన ఓటమి పాలయ్యారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. ప్రధానమంత్రి హోదాలో చివరిసారి ఇమ్రాన్ శుక్రవారం ప్రసంగించారు. కొత్త ప్రభుత్వాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. అది కచ్చితంగా అమెరికాకు తొత్తులా మారుతుందని విమర్శించారు. ప్రజల మద్దతుతో మళ్లీ పదవి చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. పాక్ లో తర్వాత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త ప్రధాని కోసం సోమవారం జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది.
Christmas vacation Visa Free Countries : క్రిస్మస్ వెకేషన్ కు వెళ్లాలంటే ఈ దేశాలు బెస్ట్ | ABP Desam
China Pneumonia Outbreak | చైనాలో వెలుగు చూసిన కొత్త వైరస్.. కరోనా కంటే డెంజర్..? | ABP Desam
Hamas Secret Tunnel: ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన హమాస్ రహస్య సొరంగం వీడియో ఇదే.. అందులో ఏమున్నాయ్..?
Houthi Rebels Cargo Ship Hijacking Visuals : హౌతీ రెబెల్స్ ఇండియాకు వచ్చే షిప్ ఎలా హైజాక్ చేశారంటే.?
NASA’s Webb Reveals Heart of Milky Way : జేమ్స్ వెబ్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్ | ABP Desam
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?
ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ
KTR Comments O Praja Darbar: ప్రజా దర్బార్ పై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్
/body>