Today's Episode: మళ్లీ డాక్టర్ గా మారిన కార్తీక్... చిన్ని, ఆకర్ష్ కలవకూడదంటూ సంకేతాలు
ఇవాళ్టి కార్తీక దీపం ఎపిసోడ్ లో బాబుకు జ్వరమొచ్చిందని కార్తీక్ తడిగుడ్డతో ఒళ్లంత తుడుస్తాడు. అయినా జ్వరం తగ్గకపోయేసరికి ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉంటాడు. దీప ఇంటికి రావడం లేట్ అవ్వడంతో రుద్రాణి ఏమైనా చేసిందేమో అని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఇటు నర్సమ్మను వారణాసి పనిలోంచి తీసేస్తాడు. మోనిత ఎవ్వరిని పనిమనిషిగా పెట్టుకున్నా అలాగే పంపించేస్తామని వారణాసి వార్నింగ్ ఇస్తాడు. బాబును తామే పెంచుకోబోతున్నామని.. ఎవ్వరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దని దీప తన పిల్లలకు చెబుతుంది. బాబును హాస్పిటల్ కు తీసుకెళ్తానని కార్తీక్ చెప్తే... తను డాక్టర్ అన్న విషయం మర్చిపోవద్దని దీప చెబుతుంది. అప్పుడు కార్తీక్ బాబుకు కావాల్సిన మందులను ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తాడు.





















