MP UttamKumar Reddy : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై లోక్ సభలో మాట్లాడిన ఎంపీ ఉత్తమ్ కుమార్
తెలంగాణలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోందని వాటిని వెంటనే విరమించుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెంటనే విరమించుకోవాలన్నారు. కొత్త గూడెం బ్లాక్, సత్తుపల్లి బ్లాక్, శ్రావణపల్లి బ్లాక్, కల్యాణ ఖని బ్లాక్ లను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయటం పట్ల అక్కడ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. కార్మికుల, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణంయ జాతి ప్రయోజనాలకు విఘాతమన్నారు. కేంద్రం వెంటనే నాలుగు బొగ్గు ఉత్పత్తి బ్లాక్ ల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలన్నారు.





















