Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్
అపర కుబేరుడైన రతన్ టాటాకు ఫ్రెండ్స్ అంటే వీఐపీలు,..వీవీఐపీలు ఉంటారు అనుకుంటాం కదా. కానీ అది తప్పు. రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో ఈ చిన్న కుర్రాడు. ఇతని పేరు శంతనునాయుడు. ప్రస్తుతం 30 సంవత్సరాలు. కానీ ఇతను టాటా కి పరిచయం అయినప్పుడు వయస్సు జస్ట్ 18 సంవత్సరాలే. వీళ్లద్దరి స్నేహానికి వయస్సుతో పనిలేదు. టాటా భుజం మీద చేయి వేసి ఫోటోలు దిగగల చనువు శంతను నాయుడు కే ఉంది అంటారు తెలిసినవాళ్లు. టాటా ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న రతన్ టాటాకు మేనేజర్ గా 2018లో నియమితుడవటంతో శంతను నాయుడు గురించి అందరికీ తెలిసింది. కానీ టాటాకు ఇతని పరిచయం ఇంకా ముందుగానే జరిగింది. 2014లో పుణేలోని సావిత్రీబాయి పూలే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన శంతను...తర్వాత మోటో పా అని ఓ వైల్డ్ హెల్ప్ స్టార్టప్ట్ ను ప్రారంభించాడు. ప్రమాదాల్లో అవయవాలను కోల్పోయిన మూగజీవాల సంరక్షణం కోసం మోటో పా పనిచేసిది. సరిగ్గా ఇదే పని రతన్ టాటా ను శంతను నాయుడుకు దగ్గర చేసింది. తొలుత అతని సంస్థలో పెట్టుబడి పెట్టడం అచ్చం తనలానే పెట్ లవర్ అయిన శంతను ను అక్కున చేర్చుకున్నారు రతన్ టాటా. తర్వాత ఈ ఫ్రెండ్ షిప్ ఎంతవరకూ వెళ్లిందంటే శంతను టాటా దగ్గరే అప్రెంటింస్ చేసి ఆయన ట్రస్ట్ లోనే ఆయనకే మేనేజర్ గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం టాటా ట్రస్ట్ లోని ఆధ్వర్యంలోని స్మాల్ యానిమల్ హాస్పటల్ కూడా డైరెక్టర్ శంతను నాయుడునే. టాటా బర్త్ డేలకు కేక్స్ తినిపించటం ఆయనతో కలిసి టైమ్ సెలబ్రేట్ చేయటం..దేశంలో పరిశ్రమలు నడుస్తున్న తీరు, ప్రజల సమస్యలు, వాటిని సాల్వ్ చేసిన విధానం ఇలా ఎన్నో విషయాలను శంతనుకు నేర్పి ఓ భావి భారత నాయకుడిగా అతన్ని తీర్చిదిద్దారు రతన్ టాటా. టాటాతో తనకున్న అనుభవాలు, నేర్చుకున్న విషయాల మీద ఐ కేమ్ అపాన్ లైట్ హౌస్ అనే పుస్తకమే రాశాడు శంతన్ నాయుడు