Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Swiggy Premium Membership: స్విగ్గీ, తన ప్రీమియం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను వన్ బ్లాక్ పేరుతో ప్రారంభించింది. దీనిలో, యూజర్లకు అపరిమితంగా ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు లభిస్తాయి.
Swiggy Premium Membership Program: ఆన్‌లైన్ ఫుడ్ & గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగీ, తన ప్రత్యర్థిక కంపెనీ జొమాటో (Zomato)కు పోటీగా, ప్రీమియం మెంబర్‌షిప్ ప్లాన్‌ను 'వన్ బ్లాక్' (One BLCK) పేరుతో ప్రారంభించింది. బుధవారం (11 డిసెంబర్ 2024) ఈ మెంబర్‌షిప్ ఆఫర్‌ను ఫుడ్ డెలివెరీ కంపెనీ లాంచ్ చేసింది. మెరుగైన సేవలను కోరుకునే కస్టమర్లను ఈ ప్రీమియం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేర్చుకుంటామని కంపెనీ తెలిపింది.
వన్ బ్లాక్ సభ్యులకు అన్నింటా ప్రాధాన్యత
వన్ బ్లాక్ మెంబర్‌షిప్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకునే కస్టమర్‌లు ఆహారం లేదా కిరాణా వస్తువులకు అపరిమిత ఉచిత డెలివరీలు (Unlimited Free Home Delivery Offer) & ఆర్డర్‌లపై భారీ డిస్కౌంట్‌లు (Huse Discounts) ఎంజాచ్ చేయొచ్చు. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఉచిత కాక్‌టెయిల్, శీతల పానీయాలు. డెజర్ట్ వంటివి కాంప్లిమెంటరీగా అందుతాయి. అంతేకాదు ఈ సబ్‌స్క్రయిబర్లకు ఆహారాన్ని వేగంగా అందించేందుకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తుంది. వన్ బ్లాక్‌ను ఎంచుకున్న యూజర్లకు ఆన్ టైమ్ డెలివరీకి హామీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతో పాటు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, చందాదారులు తమ అభిప్రాయాలను స్విగ్గీ టాప్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు తెలియజేసే అవకాశం పొందుతారు. అంటే ఇందులో సభ్యులకు ప్రాధాన్యతపై కస్టమర్ కేర్ సర్వీస్ లభిస్తుంది.
స్విగ్గీలో అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి, ప్రస్తుత స్విగ్గీ వన్ (Swiggy One) సభ్యులు కూడా ఈ సర్వీస్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. వన్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌తో... ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, డైన్ ఔట్ వంటి అన్ని వర్గాల ప్రయోజనాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ఈ సభ్యులు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), హాట్ స్టార్ (Hotstar), హామ్లేస్ (Hamleys), సినీపొలిస్ (Cinepolis) వంటి అగ్ర భాగస్వామి బ్రాండ్‌ల నుంచి మంచి ఆఫర్‌లు కూడా పొందుతారు.
"స్విగ్గీ వన్ బ్లాక్ ప్రోగ్రామ్, మా కస్టమర్‌లకు బిజినెస్ క్లాస్ సర్వీస్ వంటిది. ఇండస్ట్రీలో, ప్రీమియం మెంబర్‌షిప్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ని మేము సెట్ చేస్తున్నాం" - స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు & CGO ఫణి కిషన్
వన్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ ధర ఎంత?
స్విగ్గీ వన్ బ్లాక్ సేవలు పొందడానికి, మూడు నెలల కోసం రూ. 299 ఫీజ్ చెల్లించాలి. అంటే, నెలకు రూ. 100 కన్నా తక్కువ ఖర్చవుతుంది. స్విగ్గీ వన్ బ్లాక్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు జరుగుతుంది. ప్రస్తుతం, దేశంలోని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే సభ్యత్వ సేవను కంపెనీ అందిస్తోంది.
జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్
ఇండస్ట్రీలో, స్విగ్గీకి ప్రధాన పోటీ కంపెనీ జొమాటో ఇటీవలే గోల్డ్ మెంబర్‌షిప్ (Zomato Gold Membership)ను లాంచ్ చేసింది. జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ధర కేవలం 30 రూపాయలు. ఈ ప్రోగ్రామ్ కింద, కస్టమర్‌లు రూ. 200 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లపై 7 కిలోమీటర్ల పరిధిలో ఉచిత డెలివరీలు పొందొచ్చు. ఇది మాత్రమే కాకుండా, ఈ ప్లాన్ ద్వారా ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా యూజర్లు ఆస్వాదించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: రూ.80 వేల పైన పసిడి, రూ.లక్ష పైన వెండి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ