బనారస్ రైల్వే స్టేషన్ ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలి
ప్రధాని నరేంద్ర మోదీ.. వారణాసి పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం, ఆలయ దర్శనాలు, గంగా స్నానం ఇలా సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని. అయితే ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మోదీ కాశీ వీధుల్లో కాలినడకన తిరిగారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కొంత సేపు నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం 1.23 నిమిషాలకు బనారస్ రైల్వే స్టేషన్‌ను మోదీ సందర్శించారు. ప్రయాణికుల కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు. రైళ్ల కనెక్టివిటీని మెరుగుపరచడం సహా పరిశుభ్రత, ఆధునికత, ప్రయాణికులకు స్నేహపూర్వక రైల్వే స్టేషన్ల ఏర్పాటులో తమ ప్రభుత్వం కృషి చేస్తోంది.




















