Human Rights Day : మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు...
భూమ్మీద జీవించే ప్రతి మనిషికి పుట్టుకతోనే కొన్ని హక్కులు లభిస్తాయి. ప్రపంచంలోని మానవజాతి మొత్తం ఒక కుటుంబం లాంటివి. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నట్టే, గౌరవం అందినట్టే, ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ఆ హక్కులు, గౌరవం అందాలి. అదే ఈ ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ముఖ్య ఉద్దేశం. 1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి తొలిసారిగా ‘విశ్వ మానవ హక్కుల ప్రకటన’ చేసింది. ఆ రోజు నుంచి ప్రపంచమంతా డిసెంబర్ 10న ‘మానవ హక్కుల దినోత్సవం’ నిర్వహించుకుంటుంది. మనదేశంలో కూడా ఇదే రోజును హూమన్ రైట్స్ డేగా పరిగణిస్తాం. 1948లో ఐక్యరాజ్యసమితి ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR)’ పేరుతో డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఇది ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే ఒక అధికార పత్రం. దీన్ని ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువదించారు. దాదాపు 500 భాషల్లోకి ఇది ట్రాన్స్‌లేట్ అయ్యింది.