IND vs SA 2nd ODI: తొలి వన్డేలో చేసిన ఏయే తప్పులను సరిదిద్దుకోవాలి? | India | Cricket
శుక్రవారం సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తలపడబోతోంది. తొలి వన్డే జరిగిన పార్ల్ లోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. తొలి మ్యాచ్ లో అనేక సందర్భాల్లో మ్యాచ్ లో పట్టు సాధించినప్పటికీ... దాన్ని నిలుపుకోలేక భారత్ మ్యాచ్ ను సమర్పించుకుంది. ఈసారి అలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. రెండో వన్డే కనుక ఓడితే.. సిరీస్ ను ఇక్కడే కోల్పోవాల్సి వస్తుంది. తొలి వన్డేలో మధ్య ఓవర్లలో వికెట్లు పడగొట్టడానికి బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది. దాన్ని బవుమా, వాండర్ డసెన్ వాడుకుని శతకాలు బాదేశారు. బ్యాటింగ్ లో Dhawan, Kohli రాణించినా మిడిలార్డర్ దెబ్బతీసింది. కెప్టెన్ Rahul గత మ్యాచ్ లో పెద్దగా ఆడనప్పటికీ... ఇటీవల మంచి ఫాంలోనే ఉన్నాడు కాబట్టి మంచి ఇన్నింగ్స్ ఆశించొచ్చు. తొలి మ్యాచ్ లో జట్టులో ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఉన్నప్పటికీ అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. మరి ఈ మ్యాచ్ లో ఏమవుతుందో చూడాలి.