BJYM: ఎల్లారెడ్డి పేట మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు విద్యార్థులతో కలిసి కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి బైఠాయించి రాస్తారోకో నిర్వహించి, ఎంఆర్ఒ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ గతంలో కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు డిగ్రీ కళాశాల ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల ముందే ప్రజలను మభ్యపెట్టే హామీలిచ్చి ప్రజలను విద్యార్థులను మోసం చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. వెంటనే కేటీఆర్ స్పందించి ఎల్లారెడ్డిపేట మండలనికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని లేనిపక్షంలో కేటీఆర్ ను ఎల్లారెడ్డిపేట మండలంలో తిరగకుండా అడ్డుకుంటామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.




















